రాజస్థాన్: ఆ దంపతులకు ఇద్దరు కొడుకులు, ఓ కూతురు ఉంది. వారంతా కలిసి రాత్రి భోజనం చేసి నిద్ర పోయారు. అందరూ గాఢ నిద్రలో ఉండగా.. అర్ధరాత్రి ఆ యువతికి సడెన్‌గా మెలకువ వచ్చింది. తమ్ముడి గదిలో లైట్ వెలుగుతుండటాన్ని గమనించింది. ఈ సమయంలో ఇంకా పడుకోకుండా ఏం చేస్తున్నాడని ఆమెకు డౌట్ వచ్చింది. అనుమానంతో తమ్ముడి గది దగ్గరికి వెళ్లి చూసింది. అక్కడ కనిపించిన సీన్ చూసి ఆమె షాకయింది. ఈ ఘటన రాజస్థాన్‌లో జరిగింది. పూర్తి వివరాల్లోకెళ్తే..
గంగాపూర్‌లోని రామ్‌రహీం ప్రాంతానికి చెందిన ఓ కుటుంబంలో తండ్రి సంషుద్దీన్తో పాటు ఓ కూతురు, కొడుకులు బారిష్ ఖాన్, అమీర్ ఖాన్లు ఉంటున్నారు. వీళ్లంతా ఎప్పటిలాగే మంగళవారం రాత్రి అందరూ కలిసి భోజనం చేశారు. ఆ తర్వాత ఎవరి గదుల్లో వారు నిద్రపోతున్నారు. అర్ధరాత్రి సంషుద్దీన్ కూతురికి మెలకువ వచ్చింది. పక్కనే ఉన్న బారిష్ ఖాన్ గదిలో లైట్ ఇంకా ఆన్ చేసి ఉండడంతో ఆమెకు డౌట్ వచ్చింది. అనుమానంతో వెళ్లి తలుపులు తెరిచేందుకు ప్రయత్నించింది. కానీ లోపలి నుంచి గడియ పెట్టి ఉండడంతో కిటికీలో నుంచి గదిలోకి చూసింది. అక్కడ ఉరికి వేలాడుతున్న తమ్ముడి శవాన్ని చూసి పెద్దగా కేకలు వేసింది.
ఇవి కూడా చదవండి
ఆ శబ్దానికి ఇంట్లోని వారందరూ నిద్ర లేచారు. తలుపులు పగులగొట్టి అతడిని రక్షించేందుకు ప్రయత్నించారు. కానీ అప్పటికే బారిష్ చనిపోయాడు. మృతుడి సోదరుడు అమీర్ ఖాన్ తన అన్న మద్యానికి బానిసయ్యాడని తెలిపాడు. ప్రతిరోజూ రాత్రి పూటుగా తాగి ఇంటికి వచ్చేవాడని చెప్పాడు. ఈ క్రమంలోనే ఆత్మహత్య చేసుకుని ఉంటాడని అభిప్రాయపడ్డాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. శవానికి పోస్టుమార్టం నిర్వహించి బుధవారం కుటుంబ సభ్యులకు అప్పగించారు.