మిర్జాపూర్ సినిమా చూసి రౌడీలుగా మారిన కుర్రాళ్లు.. వారంతా ఏం చేస్తున్నారంటే?

ABN , First Publish Date - 2022-06-02T07:49:42+05:30 IST

ప్రముఖ వెబ్ సిరీస్ ‘మిర్జాపూర్’ ఎంత హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఆ సిరీస్‌ అంతా క్రిమినల్స్ గురించే. అది చూసిన కొందరు కుర్రాళ్లు.. తాము కూడా మిర్జాపూర్ పాత్రల్లా బతకాలని ట్రై చేశారు. ఒక హైవేపై ఉన్న హోటల్స్, డాభాల యజమానులను కొట్టడం ప్రారంభించారు. ఇటీవల ఇలా ఒక రోడ్డుపై యువకుడిని...

మిర్జాపూర్ సినిమా చూసి రౌడీలుగా మారిన కుర్రాళ్లు.. వారంతా ఏం చేస్తున్నారంటే?

ప్రముఖ వెబ్ సిరీస్ ‘మిర్జాపూర్’ ఎంత హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఆ సిరీస్‌ అంతా క్రిమినల్స్ గురించే. అది చూసిన కొందరు కుర్రాళ్లు.. తాము కూడా మిర్జాపూర్ పాత్రల్లా బతకాలని ట్రై చేశారు. ఒక హైవేపై ఉన్న హోటల్స్, డాభాల యజమానులను కొట్టడం ప్రారంభించారు. ఇటీవల ఇలా ఒక రోడ్డుపై యువకుడిని తీవ్రంగా కొట్టారు. ఈ వీడియో చాలా వైరల్ అయింది. ఇది పోలీసుల దృష్టికి కూడా వచ్చింది. ఇదంతా ఉత్తరప్రదేశ్‌లోని ఒరియా కోత్వాలీ ప్రాంతంలో వెలుగు చూసింది. 


హైవేపై వ్యాపారాలు చేసుకునే కొందరు కూడా వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు రకరకాల యాంగిల్స్‌లో దర్యాప్తు చేశారు. చివరకు ప్రభు చౌబే, రామూ పాండే, మాధవ్ తోమర్, వికాస్, రాజ్‌దీప్ అనే కుర్రాళ్లే ఈ ఘాతుకాలకు పాల్పడినట్లు గుర్తించారు. వారందర్నీ అరెస్టు చేశారు. 


విచారణ సందర్భంగా మిర్జాపూర్ వెబ్ సిరీస్ చూసిన తర్వాతనే గ్యాంగ్‌స్టర్ అవ్వాలనే కోరిక కలిగిందని, అదే ఆలోచనతో తాము ఈ దందాలోకి దిగామని ఆ కుర్రాళ్లు చెప్పారు. వీళ్ల దగ్గర నుంచి 32 కాలిబర్ తుపాకీ, కత్తులు కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.


Updated Date - 2022-06-02T07:49:42+05:30 IST