బంగారం చోరీ కేసులో యువకుడి అరెస్ట్‌.. 10 తులాల ఆభరణాలు స్వాధీనం

ABN , First Publish Date - 2020-08-03T16:23:03+05:30 IST

బంగారు ఆభరణాలు చోరీకి పాల్పడుతు న్న ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్‌ఐ దాసు తెలిపిన వివరాల ప్రకారం మహారాష్ట్రకు చెందిన రాహిల్‌(25) డ్రైవర్‌గా పనిచేస్తూ హైదరాబాద్‌లో

బంగారం చోరీ కేసులో యువకుడి అరెస్ట్‌.. 10 తులాల ఆభరణాలు స్వాధీనం

మేడ్చల్‌(రంగారెడ్డి) : బంగారు ఆభరణాలు చోరీకి పాల్పడుతు న్న ఓ యువకుడిని  పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్‌ఐ దాసు తెలిపిన వివరాల ప్రకారం మహారాష్ట్రకు చెందిన రాహిల్‌(25) డ్రైవర్‌గా పనిచేస్తూ హైదరాబాద్‌లో నివసిస్తుండేవాడు. తాళం వేసిన ఇళ్లను టార్గెట్‌ చేసి చోరీలకు పాల్పడేవాడు. మేడ్చల్‌ పట్టణం హౌజింగ్‌బోర్డులో గల హిందుస్థాన్‌ జ్యూవెల్లర్స్‌ షాపు యజమాని ముకేశ్‌ చౌదరి లాక్‌డౌన్‌ కారణంగా మార్చిలో దుకాణాన్ని మూసివేసి ఆభరణాలను తన ఇంట్లో భద్రపరిచాడు.


ఈ క్రమంలో కుటుంబ సభ్యులతో కలిసి పని నిమిత్తం ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. ఇంటికి తాళం వేసి ఉండడాన్ని గమనించిన రాహిల్‌ ఇంట్లోకి చొరబడి ఆభరణాలను ఎత్తుకెళ్లాడు. అనంతరం మహారాష్ట్రలోని ముత్తూట్‌ ఫైనాన్స్‌లో కుదువ పెట్టి రూ.2.60 లక్షలు తీసుకున్నాడు. కేసు దర్యాప్తు చేపట్టిన మేడ్చల్‌ పోలీసులు మహారాష్ట్రకు వెళ్లి రాహిల్‌ను అదుపులోకి తీసుకున్నారు.  అతని వద్ద నుంచి 10 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకు రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ దాసు తెలిపారు. 


Updated Date - 2020-08-03T16:23:03+05:30 IST