గ్రూప్‌లో చేరడం మీ ఇష్టం!

ABN , First Publish Date - 2020-08-01T07:47:20+05:30 IST

అనుమతి లేకుండానే వాట్సప్‌ గ్రూప్స్‌లో యాడ్‌ చేస్తుంటారు. దాంతో మెసేజ్‌లు వరదలా వచ్చి పడుతుంటాయి.

గ్రూప్‌లో చేరడం మీ ఇష్టం!

అనుమతి లేకుండానే వాట్సప్‌ గ్రూప్స్‌లో యాడ్‌ చేస్తుంటారు. దాంతో మెసేజ్‌లు వరదలా వచ్చి పడుతుంటాయి. వాటిని డిలీట్‌ చేయలేక చికాకు వస్తూ ఉంటుంది. అయితే ఎవరు పడితే వారు గ్రూప్‌లో యాడ్‌ చేయకుండా, ముందుగా అనుమతి తీసుకునేలా సెట్టింగ్స్‌లో మార్పు చేసుకోవచ్చు.


ఇందుకోసం వాట్సప్‌ యాప్‌ ఓపెన్‌ చేసి సెట్టింగ్స్‌లో అకౌంట్‌ సెక్షన్‌లోకి వెళ్లి ప్రైవసీ ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి. అందులో గ్రూప్స్‌ ఆప్షన్‌పై క్లిక్‌ చేస్తే ‘ఎవ్రీవన్‌’, ‘మై కాంటాక్ట్స్‌’, ‘మై కాంటాక్ట్స్‌ ఎక్సెప్ట్‌’ ఆప్షన్లు కనిపిస్తాయి. అందులో మిమ్మల్ని ఎవరు గ్రూప్‌లో యాడ్‌ చేసుకోవచ్చో ఎంచుకోవాలి. అలా ఎంచుకుంటే గ్రూప్‌ ఇన్విటేషన్‌ ముందుగానే మీకు వస్తుంది. ఇలాచేస్తే మీ అనుమతి లేకుండా మిమ్మల్ని గ్రూప్‌లో యాడ్‌ చేయడం సాధ్యం కాదు.

Updated Date - 2020-08-01T07:47:20+05:30 IST