ఇది ఉంటే మీ ఆన్‌లైన్‌ భద్రత సమస్య తీరిపోయినట్టే!

ABN , First Publish Date - 2020-02-22T03:03:36+05:30 IST

ఆన్‌లైన్‌ లో మన పనులన్నీ బహిర్గతం కాకుండా ఉండాలంటే - సమాచార భద్రత, వ్యక్తిగత లావాదేవీల భద్రత కావాలంటే VPN ( విపిఎన్‌ - వర్చువల్‌ ప్రైవేట్‌ నెట్‌వర్క్‌ ) తప్పనిసరి.

ఇది ఉంటే మీ ఆన్‌లైన్‌ భద్రత సమస్య తీరిపోయినట్టే!

ఆన్‌లైన్‌ లో మన పనులన్నీ బహిర్గతం కాకుండా ఉండాలంటే - సమాచార భద్రత, వ్యక్తిగత లావాదేవీల భద్రత కావాలంటే VPN ( విపిఎన్‌ - వర్చువల్‌ ప్రైవేట్‌ నెట్‌వర్క్‌ ) తప్పనిసరి. ముఖ్యంగా బ్యాంకింగ్‌ లాంటి ఫైనాన్షియల్‌ వ్యవహారాలు చేసేటప్పుడు మన వివరాలు బయటపడడం ప్రమాదకరం. అందుకే ఇప్పుడు అందరూ వర్చువల్‌ ప్రైవేట్‌ నెట్‌వర్క్‌ల మీద ఆధారపడుతున్నారు. యాంటివైరస్‌ సాఫ్ట్‌వేర్లను అందించే దాదాపు ప్రతి సంస్థా ఇప్పుడు ఒక విపిఎన్‌ సర్వీసుని కూడా అందిస్తోంది. అయితే విపిఎన్‌ అనేది ఇంకా ఉచిత సర్వీస్‌ అని చెప్పలేం. చాలావరకూ విపిఎన్‌ సర్వీసులు పెయిడ్‌ సర్వీసెస్‌గానే లభిస్తున్నాయి. కొన్ని ఉచిత విపిఎన్‌లు ఉన్నప్పటికీ - అవి మన సమాచారాన్ని సేకరించే ప్రమాదం ఉందని సైబర్‌ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉచితంగా లభిస్తోంది కదా అని అడ్డమైన VPN సర్వీసుకీ సబ్‌ స్క్రయిబ్‌ చేస్తే - కంచే చేను మేసినట్టు - క్రెడిట్‌ కార్డ్‌ బ్యాంక్‌ పాస్‌వర్డ్స్‌ లాంటి వివరాలతో సహా మన గుట్టుమట్లన్నీ బహిర్గతమయ్యే ప్రమాదం ఉంది. అయితే - పేరున్న పెయిడ్‌ విపిఎన్‌ సర్వీసులు ఏడాదికి దాదాపు రూ.2000 నుంచి రూ.3000 వరకూ వసూలు చేస్తున్నాయి. ఇది కొంత భారమైన వ్యవహారమే. అందుకే ఇప్పుడు మొజిల్లా రంగంలోకి దిగింది.


నెట్‌ యూజర్లకి చిరపరిచితమైన మొజిల్లా తన ఫైర్‌ఫాక్స్‌ బ్రౌజర్లోనే విపిఎన్‌ సౌకర్యాన్ని ఒక ఎక్స్‌టెన్షన్‌గా అందించింది.  ఇప్పుడు యాప్‌ రూపంలో మొజిల్లా విపిఎన్‌ సర్వీసు అందుతోంది. అయితే ఇది ఇంకా క్లోజ్‌డ్‌ బీటా గానే ఉంది. అంటే - పబ్లిక్‌ అందరికీ ఓపెన్‌గా దొరకడం కాకుండా - సైన్‌ అప్‌ చేసిన కొద్ది మందికి మాత్రమే డౌన్‌లోడ్‌గా లభ్యమవుతుందన్నమాట! దీనిని అన్నివిధాలుగానూ టెస్ట్‌ చేసి సెక్యూరిటీ పరీక్షల్లో రాటుదేలిన తరవాత ఫైనల్‌ వెర్షన్‌ అందుబాటులోకి వస్తుంది. మొజిల్లా లాంటి సంస్థనుంచి విపిఎన్‌ సర్వీస్‌ లభించడం అంటే - చాలామందికి విపిఎన్‌ సమస్య తీరిపోయినట్టే!

Updated Date - 2020-02-22T03:03:36+05:30 IST