Prithvi Shaw‌పై ప్రశంసలు కురిపిస్తూ గ్రెగ్ చాపెల్ లేఖ

ABN , First Publish Date - 2021-07-21T00:07:31+05:30 IST

టీమిండియా యువ ఓపెనర్ పృథ్వీషా ఇన్నింగ్స్‌కు ప్రశంసలు కురుస్తున్నాయి. శ్రీలంకతో

Prithvi Shaw‌పై ప్రశంసలు కురిపిస్తూ గ్రెగ్ చాపెల్ లేఖ

కొలంబో: టీమిండియా యువ ఓపెనర్ పృథ్వీషా ఇన్నింగ్స్‌కు ప్రశంసలు కురుస్తున్నాయి. శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో 24 బంతుల్లోనే 43 పరుగులు చేసిన షా అద్భుతంగా ఆడాడని కొనియాడుతూ తాజాగా టీమిండియా మాజీ కోచ్ గ్రెగ్ చాపెల్ లేఖ రాశాడు. షా ఆడిన ఇన్నింగ్స్ హైలెట్స్ చూశానని ఆ లేఖలో పేర్కొన్న చాపెల్.. క్రీజులో ఫుట్‌వర్క్ అద్భుతంగా ఉందని ప్రశంసించాడు. ఫుల్‌లెంగ్త్ బంతులను బాగా ఆడుతున్నాడని పేర్కొన్నాడు. బ్యాట్ స్వింగ్ కూడా చాలా మెరుగ్గా ఉందని కొనియాడాడు.


22 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కొట్టిన బౌండరీ అత్యద్భుతంగా ఉందని, ఈ బంతిని బౌండరీకి తరలించిన తీరు చూస్తే బ్యాటింగ్ పొజిషన్ ఎంత బాగున్నదీ అర్థం చేసుకోవచ్చన్నాడు. బంతిని సరిగ్గా అర్థం చేసుకోవడమే కాక, ప్రమాదకరమైన ఫుల్ లెంగ్త్ బంతులను చక్కగా ఆడుతున్నావంటూ పృథ్వీషాను గ్రెగ్ చాపెల్ ఆకాశానికెత్తేశాడు. 

Updated Date - 2021-07-21T00:07:31+05:30 IST