ప్రేమ వ్యవహారం కారణంగా యువకుడి దారుణ హత్య

ABN , First Publish Date - 2020-10-20T14:58:17+05:30 IST

కరీంనగర్‌: తమ కుమార్తెను ప్రేమించాడనే కోపంతో యువతి కుటుంబీకులు

ప్రేమ వ్యవహారం కారణంగా యువకుడి దారుణ హత్య

కరీంనగర్‌: తమ కుమార్తెను ప్రేమించాడనే కోపంతో యువతి కుటుంబీకులు ఓ యువకుడిని దారుణంగా హతమార్చిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వీణవంక మండలం పోతిరెడ్డిపల్లిలో ప్రవీణ్‌(22) అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ప్రేమ వ్యవహారం కారణంగా యువతి కుటుంబీకులు హత్య చేసి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు. పోతిరెడ్డిపల్లికి చెందిన నర్కురి ప్రవీణ్‌(22) ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. స్థానికుల సమాచారం మేరకు జమ్మికుంట రూరల్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తును కొనసాగిస్తున్నారు. ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.  

Updated Date - 2020-10-20T14:58:17+05:30 IST