తమ కుమార్తెను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని దారుణంగా కొట్టి చంపేశారు

ABN , First Publish Date - 2020-05-20T15:54:00+05:30 IST

మెదక్: తమ కూతురిని ప్రేమ పేరుతో వేధిస్తున్నాడనే నెపంతో ఓ యువకుడిని అమ్మాయి తరుఫు కుటుంబ సభ్యులు అతి దారుణంగా నరికి చంపిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.

తమ కుమార్తెను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని దారుణంగా కొట్టి చంపేశారు

మెదక్: తమ కూతురిని ప్రేమ పేరుతో వేధిస్తున్నాడనే నెపంతో ఓ యువకుడిని అమ్మాయి తరుఫు కుటుంబ సభ్యులు అతి దారుణంగా నరికి చంపిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ దారుణ ఘటన నిజాంపేట మండలం రాంపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. నర్సింహులు  గౌడ్ అనే యువకుడిని తమ కూతురిని ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని అమ్మాయి తరుపు బంధువులు దారుణంగా కొట్టారు. కొన ఊపిరితో ఉన్న నర్సింహులును స్థానికులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.

Updated Date - 2020-05-20T15:54:00+05:30 IST