Advertisement
Advertisement
Abn logo
Advertisement

పెళ్లికి తొందరెందుకు అన్నందుకు.. యువకుడి బలవన్మరణం

హైదరాబాద్ సిటీ/అంబర్‌పేట : పెళ్లికి తొందర ఎందుకని తల్లి  అనడంతో మనస్తాపానికి గురై ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన అంబర్‌పేటలోని న్యూపటేల్‌నగర్‌లో గురువారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. సురేష్‌, చిన్నమ్మ దంపతులు అంబర్‌పేట న్యూపటేల్‌నగర్‌లో నివాసముంటున్నారు. వారికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడికి వివాహమైంది. చిన్న కుమారుడు శశి(24) బుధవారం సాయంత్రం తల్లితో ఓ అమ్మాయిని ప్రేమించానని, వివాహం చేసుకుంటానని చెప్పాడు. తల్లి ఇప్పుడే వివాహం వద్దని కొన్ని రోజులు ఆగుదాం అని సూచించింది. దీంతో మనస్తానం చెందిన అతడు రా త్రి 8.30  సమయంలో ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు. తన గదిలోంచి బయటికి రాకపోవడంతో తల్లి లోపలికి వెళ్లి చూసేసరికి అప్పటికే మృతి చెందాడు. ఆమె ఫిర్యాదు మేరకు అంబర్‌పేట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement