పెళ్లి తల్లికి ఆర్థిక భారమవుతుందని యువతి ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-03-19T15:26:34+05:30 IST

తన పెళ్లి తల్లికి ఆర్థిక భారమవుతుందని ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది.

పెళ్లి తల్లికి ఆర్థిక భారమవుతుందని యువతి ఆత్మహత్య

హైదరాబాద్/సైదాబాద్‌ : తన పెళ్లి తల్లికి ఆర్థిక భారమవుతుందని ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. మాదన్నపేట పూలతోటలో నివసిస్తున్న అలివేలు(27) అపోలోలో హోంకేర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తోంది. తండ్రి స్వామి ఆమె చిన్నప్పుడే చనిపోయాడు. తల్లి పనులు చేస్తూ కుమార్తె, కుమారుడిని కష్టపడి పెంచింది. అలివేలు వివాహం మేనబావతో నిశ్చయమైంది. ఆమె తల్లి వివాహ తేదీలు ఖరారు చేసేందుకు అబ్బాయి ఇంటికి బుధవారం వెళ్లింది. తన పెళ్లి చేసేందుకు తల్లి ఆర్థికంగా ఇబ్బంది పడుతుండడంతో అలివేలు కలతచెందింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుంది. మాదన్నపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-03-19T15:26:34+05:30 IST