Abn logo
May 28 2020 @ 09:58AM

పాత కక్షలు.. యువకుడి దారుణ హత్య

Kaakateeya

హైదరాబాద్/జీడిమెట్ల : పాత కక్షలతో ఓ యువకుడిని మద్యం మత్తులో ముగ్గురు యువకులు దారుణంగా హత్య చేశారు. రోడామేస్త్రినగర్‌ శ్రీరాంనగర్‌కు చెందిన జమీల్‌ కుమారుడు సయ్యద్‌ హఫీజ్‌(21)మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్‌ ఎస్‌కే అక్బర్‌, షేక్‌ జబ్బార్‌, హనీర్‌ స్నేహితులు. వీరంతా మంగళవారం రాత్రి 9 గంటల నుంచి శ్రీరాంనగర్‌ కట్టెలమండి సమీపంలో మద్యం తాగుతున్నారు. అర్ధరాత్రి మద్యం మత్తులో హఫీజ్‌, అక్బర్‌కు గతంలో పాతకక్షలు ఉండడంతో గొడవ జరిగింది. ఇద్దరూ కొట్టుకున్నారు. అక్బర్‌ కోపంతో హఫీజ్‌ తలపై రాయితో కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అక్బర్‌, జబ్బార్‌, హనీర్‌ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement
Advertisement
Advertisement