Abn logo
Jun 1 2020 @ 09:03AM

స్నేహితులతో బయటకెళ్లిన యువకుడు దారుణ హత్య

Kaakateeya

హైదరాబాద్ : స్నేహితులతో కలిసి బయటకెళ్లిన ఓ యువకుడు శనివారం రాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. బహదూర్‌పురా ఇన్‌స్పెక్టర్‌ దుర్గాప్రసాద్‌ కథనం ప్రకారం కాలాపత్తర్‌ అలీబాగ్‌ ప్రాంతానికి చెందిన షేక్‌ మహ్మద్‌ (20) తల్లిదండ్రులు చనిపోవడంతో నానమ్మ వద్ద ఉం టున్నాడు. అతనికి గంజాయి అలవాటు ఉంది. రెండు వారాల క్రితం స్థానికంగా యువకులతో గొడవ జరిగింది.


శనివారం సాయంత్రం అదే ప్రాంతానికి చెందిన మహ్మద్‌ సాజిద్‌ఖాన్‌(22)తోపాటు స్నేహితులు సయ్యద్‌ సిద్దీఖ్‌, మహ్మద్‌ అజహర్‌లు ఇంటి వద్ద ఉన్న షేక్‌ మహ్మద్‌ను బయటకు తీసుకెళ్లారు. రాత్రి 9-30 గంటల సమయంలో మీరాలం చెరువు నెక్లెస్ రోడ్‌ వద్ద ఓ యువకుడు పడి ఉన్నాడని పోలీసులకు సమాచారం అందగా, వెళ్లి చూశారు. షేక్‌మహ్మద్‌ రక్తపు మడుగులో పడి ఉన్నారు. కత్తితో అతని గొంతుకోసి చంపినట్లు గుర్తించారు. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement
Advertisement