ప్రేమించాలంటూ యువతి ఇంటికెళ్లి..

ABN , First Publish Date - 2021-04-09T18:08:33+05:30 IST

బంజారాహిల్స్‌కు చెందిన యువతి ప్రైవేటు కంపెనీలో పనిచేస్తోంది.

ప్రేమించాలంటూ యువతి ఇంటికెళ్లి..

హైదరాబాద్/బంజారాహిల్స్‌ : ప్రేమించాలంటూ యువతి ఇంటికి వెళ్లి దాడి చేసిన వ్యక్తిపై బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి.. బంజారాహిల్స్‌కు చెందిన యువతి ప్రైవేటు కంపెనీలో పనిచేస్తోంది. కొద్ది రోజులుగా గణేష్‌ అలియాస్‌ చింటూ ప్రేమించాలని ఆమె వెంట పడుతున్నాడు. ఆమె నిరాకరించడంతో రెండు రోజుల క్రితం ఆమె పనిచేస్తున్న కార్యాలయానికి వెళ్లి దాడి చేశాడు. ఫోన్‌ పగులకొట్టాడు. మరుసటి రోజు ఆమె ఇంటికి వెళ్లి యువతి కుటుంబ సభ్యులపై దాడి చేశాడు. అంతే కాకుండా పెళ్లి చేసుకోకపోతే అసభ్యకరమైన ఫోటోలను సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తానని, అందరి ముందు లైంగిక దాడి చేస్తానంటూ బెదిరించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-04-09T18:08:33+05:30 IST