Instagramలో పరిచయం.. పర్సనల్ ఫొటోలు అమ్మాయి తండ్రికే పంపాడు.. చివరికి..!

ABN , First Publish Date - 2022-05-27T12:35:51+05:30 IST

Instagramలో పరిచయం.. పర్సనల్ ఫొటోలు అమ్మాయి తండ్రికే పంపాడు.. చివరికి..!

Instagramలో పరిచయం.. పర్సనల్ ఫొటోలు అమ్మాయి తండ్రికే పంపాడు.. చివరికి..!

  • బీడీఎస్‌ విద్యార్థిని వేధిస్తున్న యువకుడిపై కేసు


హైదరాబాద్ సిటీ/బంజారాహిల్స్‌ : బీడీఎస్‌ విద్యార్థిని ఫొటోలను మార్పింగ్‌ చేసి ఆమె తండ్రికి పంపిస్తున్న యువకుడిపై జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. నగరానికి చెందిన ఓ యువతి బీడీఎస్‌ చదువుతోంది. కొద్దికాలం క్రితం ఆమెకు ఇన్‌స్టాగ్రాంలో విల్సన్‌ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. అతడు ఫేక్‌ ప్రొఫైల్‌ పెట్టినట్టు తేలడంతో బ్లాక్‌ చేసింది. ఆమె వ్యక్తిగత ఫొటోలను తస్కరించిన విల్సన్‌ బెదిరింపులకు పాల్పడటంతో ఏపీలో అతడిపై కేసు నమోదైంది. దీంతో విద్యార్థిని ఫొటోలు, వీడియోలను డిలీట్‌ చేసినట్టు విల్సన్‌ చెప్పాడు. తాజాగా మార్ఫింగ్‌ ఫొటోలను ఆమె తండ్రికి పంపిస్తున్నాడు. దీంతో బాధితురాలు జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా విల్సన్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2022-05-27T12:35:51+05:30 IST