Abn logo
Oct 22 2020 @ 06:59AM

డబ్బులు డ్రా చేసేందుకు వెళ్లి శవమై తేలాడు!

ఏడాది క్రితమే పెళ్లి.. 

మెట్ల పై నుంచి పడి యువకుడి మృతి


హైదరాబాద్/బంజారాహిల్స్‌ : ప్రమాదవశాత్తు మెట్ల పై నుంచి కింద పడి ఓ యువకుడు మృతి చెందాడు. జూబ్లీహిల్స్‌రోడ్డు నంబరు 78లో నివసించే ముత్యాల నరేష్‌(29) స్నేహితుడు తేజతో కలిసి కారులో మంగళవారం రాత్రి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఏటీఎంకు వెళ్లాడు. తేజ కారులో ఉండగా నరేష్‌ డబ్బు డ్రా చేసేందుకు ఏటీఎంలోకి వెళ్లాడు. ఎంత సేపటికీ స్నేహితుడు రాకపోవడంతో తేజ కారులో నుంచి బయటకు వచ్చి చూడగా రక్తపు మరకలు కనిపించాయి. మెట్ల పక్కనే నరేష్‌ పడి ఉన్నాడు. తలకు తీవ్రమైన గాయమవడంతో అతడిని వెంటనే జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రికి తీసుకెళ్లాడు. వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. నరేష్‌‌కు ఏడాది క్రితమే వివాహమైనట్టు పోలీసులు తెలిపారు.

Advertisement