భారీ గిఫ్ట్ పంపుతానని.. ఒక్క ఫోన్ కాల్‌తో యువతి జీవితం తలకిందులు

ABN , First Publish Date - 2021-07-18T02:41:41+05:30 IST

భారీ గిఫ్ట్ పంపుతానని.. ఒక్క ఫోన్ కాల్‌తో యువతి జీవితం తలకిందులు

భారీ గిఫ్ట్ పంపుతానని.. ఒక్క ఫోన్ కాల్‌తో యువతి జీవితం తలకిందులు

హైదరాబాద్: యువతిని ట్రాప్ చేసి ఓ కేటుగాడు ఆరు లక్షల రూపాయలు కాజేశాడు. వరుడు కోసం యువతి క్రిస్టియన్ మాట్రిమోనీ‌లో రిజిస్టర్ చేసుకున్నారు. అభిరాజ్ మనిష్ పేరుతో యువతికి కాల్ చేశాడు. ప్రొఫైల్ నచ్చిందని, పెళ్లి చేసుకుందామని యువతికి ప్రపోజ్ చేశాడు. తాను యూకేలో ఉంటానని,  ఓ సంస్థలో ఉన్నత స్థాయి ఉద్యోగం చేస్తున్నానని  చెప్పి యువతిని నమ్మించి ముగ్గులోకి దించాడు. ఎయిర్ కొరియర్ ద్వారా ఖరీదైన గిఫ్ట్ పంపిస్తున్నానని చెప్పి, కస్టమ్స్  అధికారినంటూ గొంతు మార్చి యువతిని  బెదిరించి టాక్స్ లు, జరిమానా పేరుతో యువతి నుంచి ఆరు లక్షల రూపాయలు కాజేశాడు. దీంతో యువతి సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-07-18T02:41:41+05:30 IST