చ‌నిపోయిన గంట త‌ర్వాత మ‌ళ్లీ బ‌తికిన‌ యువ‌తి..!

ABN , First Publish Date - 2020-08-25T19:16:18+05:30 IST

చనిపోయిన‌ ఓ 20 ఏళ్ల యువ‌తి అంత్యక్రియల కోసం సిద్ధం చేస్తుండగా మ‌ళ్లీ బ్రతికి అంద‌ర్నీ ఆశ్చర్యపరిచింది.

చ‌నిపోయిన గంట త‌ర్వాత మ‌ళ్లీ బ‌తికిన‌ యువ‌తి..!

డెట్రాయిట్: చనిపోయిన‌ ఓ 20 ఏళ్ల యువ‌తి అంత్యక్రియల కోసం సిద్ధం చేస్తుండగా మ‌ళ్లీ బ్రతికి అంద‌ర్నీ ఆశ్చర్యపరిచింది. మ‌ర‌ణించిన‌ ఓ గంట తర్వాత ఆమె మ‌ళ్లీ బ‌తక‌డం గ‌మ‌నార్హం. ఈ వింత సంఘటన అమెరికాలోని డెట్రాయిట్‌లో చోటుచుసుకుంది. వివరాల్లోకి వెళ్తే... డెట్రాయిట్‌కు చెందిన తిమేష బ్యూచాంప్ అనే 20 ఏళ్ల యువ‌తి మ‌తిస్థిమితం స‌రిగ్గా లేక‌పోవ‌డంతో అక్కడి ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ క్ర‌మంలో సోమ‌వారం ఆమె ఉన్న‌ట్టుండి అచేత‌నంగా ప‌డిపోయింది. దాంతో ఆమెను ప‌రీక్షించిన వైద్యులు చ‌నిపోయిన‌ట్లు నిర్ధారించారు. అనంత‌రం త‌ల్లిదండ్రుల అభ్య‌ర్థ‌న మేర‌కు వైద్యులు పోస్టుమార్టం చేయ‌కుండానే ఆమె మృతదేహాన్ని వారికి అప్ప‌గించేశారు.


దీంతో మృతదేహాన్ని ఇంటికి తీసుకుపోయారు కుటుంబసభ్యులు. ఆ త‌ర్వాత‌ అంత్యక్రియల కోసం శవాన్ని డెట్రాయిట్‌లోని ఫ్యూన‌ర‌ల్ హోంకు తీసుకెళ్లారు. అక్క‌డ అంత్య‌క్రియ‌ల‌కు ఏర్పాటు చేస్తుండ‌గా హ‌ఠాత్తుగా తిమేష శ్వాస తీసుకోవ‌డం గ‌మ‌నించారు. ఆమె గుండె కొట్టుకోవటం ప్రారంభ‌మైంది‌. శరీరంలో కదలిక కూడా మొదలైంది. కొద్దిసేప‌టి త‌ర్వాత‌ క‌ళ్లు కూడా తెరిచింది. దాంతో వెంట‌నే ఆమెను ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందించారు. చ‌నిపోయింద‌నుకున్న కూతురు మ‌ళ్లీ బ‌త‌క‌డంతో ఆమె త‌ల్లిదండ్రుల ఆనందానికి అవ‌ధుల్లేవు.   

Updated Date - 2020-08-25T19:16:18+05:30 IST