హైదరాబాద్: నగరంలోని గచ్చిబౌలిలో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. కొండాపూర్‌లోని ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గచ్చిబౌలి AIG ఆస్పత్రిలో రజని(27) అనే యువతి నర్సుగా పనిచేస్తోంది. మృతురాలు రజని స్వస్థలం ఏపీ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లా కాకినాడలోని కచేరిపేట. యువతి ఆత్మహత్యకు దారితీసిన కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి