Oct 19 2021 @ 18:15PM

యంగ్ రెబల్ స్టార్ వదిలిన ‘రొమాంటిక్’ ట్రైలర్

ఆకాష్ పూరి, కేతిక శర్మ హీరోహీరోయిన్లుగా రొమాంటిక్ డ్రామాగా రూపొందిన చిత్రం ‘రొమాంటిక్’. అక్టోబర్ 29 విడుదల కాబోతోన్న ఈ చిత్ర ట్రైలర్‌ మంగళవారం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేతుల మీదుగా విడుదలైంది. ట్రైలర్ విడుదల అనంతరం ప్రభాస్ మాట్లాడుతూ.. ‘‘రొమాంటిక్ ట్రైలర్ నిజంగానే రొమాంటిక్‌గా ఉంది. ఆకాష్ అద్భుతంగా నటించాడు. డైరెక్టర్ అద్భుతంగా తెర‌కెక్కించారు. పదేళ్ల అనుభవం ఉన్నట్టుగా, స్టార్ స్టేటస్ వచ్చినట్టుగా లాస్ట్ షాట్‌లో అద్బుతంగా అనిపించాడు. ఆకాష్‌ మొదటి సినిమాకు ఇప్పటికి చాలా ఇంప్రూవ్ అయ్యాడు. హీరోయిన్‌ అందరికీ ఈజీగా రీచ్ అవుతుంది. రమ్యకృష్ణగారు ఎప్పటిలానే అద్భుతంగా నటించారు. అందరూ అక్టోబర్ 29న‌ ఈ సినిమాను చూడండి. చిత్రయూనిట్ అందరికీ ఆల్ ది బెస్ట్’’ అని అన్నారు.

పూరి జగన్నాథ్ మాట్లాడుతూ.. ‘‘డార్లింగ్ ప్రభాస్ ఈ మూవీ ట్రైలర్ విడుదల చేయడం ఆనందంగా ఉంది. సినిమా విడుదల చేస్తున్నామని తెలిశాక ప్రభాస్ ఫోన్ చేసి మరీ పదే పదే అడిగారు. సినిమా గురించి ట్వీట్ వేయాలా? పోస్ట్ చేయాలా? ఏదైనా ఇంటర్వ్యూ ఇవ్వాలా? ఈవెంట్‌కు రావాలా? అంటూ ఫోన్ చేసి మరీ అడిగాడు. ప్రభాస్ అంత మంచివాడు’’ అని తెలుపగా ఛార్మీ మాట్లాడుతూ.. ‘‘రొమాంటిక్ ట్రైలర్‌ను ప్రభాస్ విడుదల చేయడం ఆనందంగా ఉంది. ఇందులో ఓ స్పెషల్ సాంగ్ సర్ ప్రైజింగ్‌గా ఉండబోతోంది. డార్లింగ్ అంటూ ఓ పాట రానుంది. సినిమాలో రమ్యకృష్ణగారు అద్భుతంగా నటించారు. వీఎఫ్ఎక్స్ డిపార్ట్‌మెంట్ నుంచి వచ్చిన అనిల్.. ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించాడు. ఆకాష్, కేతిక శర్మ మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. ఎక్కడికి వెళ్లినా కేతిక గురించే అడుగుతుంటారు’’ అని తెలిపింది.

ఇక 2నిమిషాల 10 సెకండ్ల నిడివిగ‌ల ఈ ట్రైల‌ర్‌ విషయానికి వస్తే... రొమాంటిక్ టైటిల్‌కు న్యాయం చేసేలా ఉంది. ఆకాష్ పూరి, కేతికల మధ్య రొమాంటిక్స్ సీన్స్ వావ్ అనేలా ఉన్నాయి. స్వచ్చమైన ప్రేమకు, శరీరాన్ని చూసి పుట్టే ప్రేమకు మధ్య ఉండే తేడాను ఈ సినిమాలో చూపించినట్టు అర్థమవుతోంది. వాస్కో పాత్రలో ఆకాష్ పూరి, మౌనిక క్యారెక్టర్‌లో కేతిక శర్మల మధ్య రొమాంటిక్స్ సీన్స్‌ చూస్తుంటే ఓ రేంజ్‌లో ఈ సినిమాని తెరకెక్కించినట్లుగా తెలుస్తోంది. కేతిక శర్మ తన అందాలతో  కుర్రకారును కట్టిపడేస్తుంటే.. రొమాంటిక్  సీన్స్, యాక్షన్ సీక్వెన్స్‌, డైలాగ్ డెలివరీలలో ఆకాష్ పూరి తన టాలెంట్ ప్రదర్శించాడు. ఈ ఇద్దరే కాకుండా రమ్యకృష్ణ ఓ పవర్ ఫుల్ పాత్ర ఈ చిత్రంలో చేసినట్లుగా ఈ ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది. పూరి కనెక్ట్స్, పూరి జగన్నాథ్ టూరింగ్ టాకిస్ బ్యానర్లపై పూరి జగన్నాథ్, ఛార్మీలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.