Abn logo
Oct 1 2020 @ 21:19PM

ఎయిర్ పోర్ట్‌లో ప్రభాస్.. పిక్స్ వైరల్‌

Kaakateeya

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ సినిమా కోసం ఆయన అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. సినిమా సంగతి పక్కన పెడితే.. ఆయన సినిమా అప్‌డేట్‌ కోసం ఆ మధ్య సోషల్‌ మీడియాలో పెద్ద యుద్ధమే చేశారు. ఆ తర్వాత వరుసగా ప్రభాస్‌ కొత్త చిత్రాల ప్రకటనలు రావడంతో అంతా హ్యాపీగా ఉన్నారు. అయినా సరే.. ప్రభాస్‌ని బిగ్‌ స్క్రీన్‌ మీద చూడాలని, లేదా ఆయన లేటెస్ట్ ఫొటోలని చూడాలని వారు సోషల్‌ మీడియాలో ఎంతో ఉత్సాహాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నారు.

అలా ఎదురు చూసే వారందరికీ ప్రభాస్‌ అద్భుతమైన ట్రీట్‌ ఇచ్చేశారు. తాజాగా ఆయన ఎయిర్‌ పోర్ట్‌లో చొక్కా మడుస్తూ.. నడిచి వస్తున్న స్టిల్స్ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ప్రభాస్‌ బొమ్మ కనబడితే చాలు.. ట్రెండ్‌ చేయాలని ఎదురుచూస్తున్న ఆయన అభిమానులు.. ఈ స్టిల్స్‌తో పండగ చేసుకుంటున్నారు. ఈ స్టిల్స్‌లో ఆయన లుక్స్ స్టన్నింగ్‌గా ఉన్నాయి. ప్రస్తుతం ఆయన 'రాధేశ్యామ్‌' షూట్‌ కోసం రెడీ అవుతున్నారు.


Advertisement
Advertisement
Advertisement