యువత చక్కటి ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలి

ABN , First Publish Date - 2021-10-29T03:35:21+05:30 IST

యువత చక్కటి ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలి జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ మనోహర్‌ అన్నారు. గురువారం స్థానికంగా ఏర్పాటు చేసిన వ్యాసరచన పోటీలు ముగింపు సందర్భంగా ఏర్పాటు సమావేశంలో ఆయన మాట్లాడారు. రక్తదానంతో ఎంతోమంది ప్రాణాలను కాపాడవ చ్చన్నారు. ఎయిడ్స్‌ నివారణకు మందు లేదని, ముందస్తు జాగ్రత్తనే మార్గమని సూచించారు.

యువత చక్కటి ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలి
వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విద్యార్ధులకు బహుతులను అందజేస్తున్న అధికారులు

-జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ మనోహర్‌

ఆసిఫాబాద్‌రూరల్‌, అక్టోబరు 28: యువత చక్కటి ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలి జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ మనోహర్‌ అన్నారు. గురువారం స్థానికంగా ఏర్పాటు చేసిన వ్యాసరచన పోటీలు ముగింపు సందర్భంగా ఏర్పాటు సమావేశంలో ఆయన మాట్లాడారు. రక్తదానంతో ఎంతోమంది ప్రాణాలను కాపాడవ చ్చన్నారు. ఎయిడ్స్‌ నివారణకు మందు లేదని, ముందస్తు జాగ్రత్తనే మార్గమని సూచించారు. యువత ఆరోగ్యవంతంగా ఉండాలంటే తీసుకో వాల్సిన పలు అంశాలపై కూలంకుషంగా వివరించారు. రక్తదానం, ఎయిడ్స్‌ నివారణపై చేపట్టిన వ్యాసరచన పోటీల్లో ప్రథమ బహుమతి ఇందిరా డిగ్రీ కళాశాల కాగజ్‌నగర్‌, ద్వితీయ బహుమతి చైతన్య డిగ్రీ కళాశాల ఆసిఫాబాద్‌, తృతీయ బహుమతి వసుంధర డిగ్రీకళాశాల విద్యార్థినులు గెలుచుకున్నారు. వీరికి బహుమతులను అందజేశారు. కార్యక్ర మంలో ప్రిన్సిపాల్‌ నీలం సంపత్‌, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ లక్ష్మినరసింహ, రమేష్‌, కౌన్సిలర్‌ సతీష్‌, ప్రిన్సిపాల్‌ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-29T03:35:21+05:30 IST