Advertisement
Advertisement
Abn logo
Advertisement

వెంటాడి..చంపేశారు

రాజానగరం, నవంబరు 26 : జాతీయ రహదారిపై ఆదికవి నన్నయ యూనివర్సిటీ సమీపంలో ఓ మినీ వ్యాన్‌ డ్రైవర్‌ను దారుణంగా చం పేశారు. ప్రాణ భయంతో వ్యాన్‌ దిగి పరిగెడుతున్న వ్యక్తిని వెంటాడి పదునైన ఆయుధాలతో విచక్షణా రహితంగా పొడిచి చంపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పిఠాపురానికి చెందిన ఒగ్గు నాగేంద్ర(34)  మినీ వ్యాన్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ నేపఽథ్యంలో కమల ఫలాలు లోడు కోసం గురువారం పిఠాపురం నుంచి తాడేపల్లిగూడెం వెళ్లాడు. అక్కడ లోడు వేసుకుని అర్ధరాత్రి సమయంలో పిఠాపురానికి తిరుగు ప్రయాణమయ్యాడు. మార్గమధ్యంలో ఆదికవి నన్నయ వర్సిటీ సమీపానికి వచ్చేసరికి గుర్తు తెలియని వ్యక్తులు పదునైన ఆయుధాలతో డ్రైవర్‌ నాగేంద్రపై దాడికి పాల్పడ్డారు. ప్రాణ భయంతో వ్యాన్‌ వదిలి పరిగెడుతున్న వ్యక్తిని వెంటాడి విచక్షణా రహితంగా పొడిచారు. కొందరు ప్రయాణికులు 100 కాల్‌కు ఫోన్‌చేసి సమాచారం అందించగా, హైవే పెట్రోలింగ్‌ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కొన ఊపిరితో ఉన్న డ్రైవర్‌ను చికిత్స కోసం సమీపంలోని జీఎస్‌ఎల్‌ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.  శరీరంపై ఉన్న బంగారం, నగదు భద్రంగానే ఉన్నాయి. క్లూస్‌టీం, డాగ్‌స్క్వాడ్‌ సహాయంతో ఆధారాలు సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. సంఘటనా స్థలాన్ని డీఎస్పీలు ఏటీవీ రవికుమార్‌, గురునాఽథ్‌ పరిశీలించారు. ఈ మేరకు రాజానగరం సీఐ ఎంవీ సుభాష్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement