గదిలో మనవడు చనిపోయి ఉన్నాడని తెలుసుకోలేకపోయిన నాయనమ్మ.. మూడు రోజుల తర్వాత పక్కింటి వాళ్లు వచ్చి చూస్తే..

ABN , First Publish Date - 2022-07-30T18:14:55+05:30 IST

ఆ ఇంట్లో వృద్ధ మహిళ, ఆమె మనవడు ఇద్దరే ఉంటారు. అయినా.. మనవడు మరణించాడన్న విషయాన్ని ఆమె గుర్తించ లేకపోయింది. పోలీసులు వచ్చి చెబితేగానీ ఆమెకు విషయం తెలియలేదు. ఒకే ఇంట్లో ఉంటున్నా.. మనవడు చనిపోయిన విషయం తె

గదిలో మనవడు చనిపోయి ఉన్నాడని తెలుసుకోలేకపోయిన నాయనమ్మ.. మూడు రోజుల తర్వాత పక్కింటి వాళ్లు వచ్చి చూస్తే..

ఇంటర్నెట్ డెస్క్: ఆ ఇంట్లో వృద్ధ మహిళ, ఆమె మనవడు ఇద్దరే ఉంటారు. అయినా.. మనవడు మరణించాడన్న విషయాన్ని ఆమె గుర్తించ లేకపోయింది. పోలీసులు వచ్చి చెబితేగానీ ఆమెకు విషయం తెలియలేదు. ఒకే ఇంట్లో ఉంటున్నా.. మనవడు చనిపోయిన విషయం తెలియదా? అనే పోలీసుల ప్రశ్నకు స్పందించి విస్తుపోయే విషయాలు చెప్పింది. ఈ క్రమంలో అతడి మరణానికి సంబంధించిన అసలు కారణాలపై పోలీసులు ఏం చెప్పారు? అనే పూర్తి వివరాల్లోకి వెళితే..


రాజస్థాన్‌లో(Rajasthan)ని భిల్వారా ప్రాంతంలో ఉన్న మెడికల్ కాలేజీ వెనకాల ఉండే బస్తీలో ఓ వృద్ధ మహిళ(Old Lady), ఆమె మనవడు(Grand son) కొన్నాళ్లుగా నివసిస్తున్నారు. ఈ క్రమంలో గత మూడు నాలుగు రోజులుగా వాళ్లు నివసిస్తున్న ఇంట్లోంచి తీవ్ర దుర్వాసన వస్తోంది. రోజు రోజుకీ ఆ వాసన భరించలేనంతగా వస్తుండటంతో.. అక్కడి స్థానికులు ఇంట్లోకి తొంగి చూశారు. అనుమానస్పందంగా కనిపించడంతో పోలీసు(Police)లకు సమాచారం ఇచ్చారు. దీంతో శుక్రవారం సాయంత్రం అక్కడకు చేరుకున్న అధికారులు.. ఇంట్లో తనిఖీలు చేశారు. ఈ క్రమంలోనే ఇంట్లోని ఓ గదిలో యువకుడి మృతదేహాన్ని గుర్తించి వృద్ధ మహిళను ప్రశ్నించారు. మృతదేహం(Dead Body) తన మనవడు చేతన్‌దే అని చెప్పిన ఆమె.. అతడు చనిపోయాడనే విషయం మీరొచ్చే వరకు తనకు తెలియదని పోలీసులకు చెప్పింది. ఆమె సమాధానం విని పోలీసులు షాకయ్యారు. ఒకే ఇంట్లో ఉంటున్నా.. మనవడు చనిపోయిన విషయం తెలియకపోవడం ఏంటి? అంటూ ప్రశ్నించారు. 



ఈ నేపథ్యంలో ఆ వృద్ధ మహిళ విస్తుపోయే నిజాలు చెప్పింది. చేతన్ తల్లి కొన్నేళ్ల క్రితం మరణించిందని.. ఆ తర్వాత పిల్లాడిన తన వద్ద వదిలి తన కొడుకు ఎక్కడికో వెళ్లిపోయాడని చెప్పింది. అప్పటి నుంచి చేతన్, తాను ఒకే ఇంట్లో ఉంటున్నట్టు వెల్లడించింది. ఒకే ఇంట్లో ఉంటున్నప్పటికీ చేతన్ తనతో ఎక్కువ మాట్లాడకపోయేవాడని తెలిపింది. చేతన్ ఇంటికి ఎపుడొస్తాడో.. ఎపుడు వెళ్తాడో తనకు తెలిసేది కాదని.. తాను కూడా ఎప్పుడూ అతడిని అడిగేదానిని కాదని పేర్కొంది. ఇద్దరి మధ్య బంధాలు బలహీనంగా ఉన్నందున చేతన్ మరణించిన విషయాన్ని తాను గుర్తించలేకపోయినట్టు చెప్పింది. కాగా.. ఈ ఘటనపై కేసు(Police case) నమోదు చేసుకున్న అధికారులు.. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అతడు మరణించడానికి గల కారణాల గురించి లోతుగా దర్యాప్తు చేయనున్నట్టు చెప్పారు. 


Updated Date - 2022-07-30T18:14:55+05:30 IST