Abn logo
Mar 3 2021 @ 12:35PM

అత్యాచారం కేసులో యువకుడికి 10 ఏళ్ల జైలు, జరిమానా

హైదరాబాద్/సైదాబాద్‌: పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడిన కేసులో   ఓ యువకుడికి పది సంవత్సరాల జైలు, రూ.50 వేలు జరిమానా విధిస్తూ మంగళవారం 11వ అదనపు మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జి తీర్పునిచ్చారు. నల్గొండ జిల్లా చర్లపల్లి బైపా్‌సకు చెందిన మేస్ర్తీ రెవల్ల సతీష్‌(22)   మాదన్నపేట వినాయక్‌ నగర్‌లో నివాసముంటున్నాడు. 2013లో ఓ యువతిని పెళ్లి చేసుకుంటానని చెప్పి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు మాదన్నపేట పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో చార్జ్‌షీట్‌ దాఖలు చేశారు.

Advertisement
Advertisement