Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Sat, 30 Apr 2022 19:44:31 IST

25ఏళ్ల కుర్రాడు.. విడిచిన సాక్సులు, అండర్‌వేర్‌లు కనీసం ఉతక్కుండానే అమ్ముతూ రూ.18లక్షల సంపాదన!

twitter-iconwatsapp-iconfb-icon
25ఏళ్ల కుర్రాడు.. విడిచిన సాక్సులు, అండర్‌వేర్‌లు కనీసం ఉతక్కుండానే అమ్ముతూ రూ.18లక్షల సంపాదన!

ఇంటర్నెట్ డెస్క్: మీరు చదివింది కరక్టే. ఓ వ్యక్తి విడిచిన సాక్సులను కనీసం ఉతక్కుండానే ఆన్‌లైన్‌లో అమ్ముతూ.. ఊహకందని రీతిలో ప్రతినెలా సంపాదిస్తున్నాడు. విడిచిన సాక్సులు ఎవరు కొంటారు? వాటికి అంత డిమాండ్ ఉంటుందా? అంటే.. దానికి అతడు అవుననే సమాధానం చెబుతున్నాడు. వాటికి అంత గిరాకీ ఉంటుందని తనకు కూడా మొదట తెలియదని చెబుతున్నాడు. ఇంతకూ ఈ వ్యాపారం చేస్తున్న వ్యక్తి ఎవరు. అతడు ఎంత మొత్తంలో సంపాదిస్తున్నాడు అనే పూర్తి వివరాల్లోకి వెళితే..


బ్రిటన్‌కు చెందిన బిల్లీ జాయ్ గ్రే అనే 25ఏళ్ల యువకుడు ఏడాది క్రితం OnlyFnas అనే సోషల్ మీడియా పేజీని క్రియేట్ చేశాడు. ఈ క్రమంలో అతడి సోషల్ మీడియా పేజీని చాలా మంది ఫాలో కావడం మొదలు పెట్టారు. ఇలా ఫాలో అవుతున్న వారిలో ఇతర దేశాలకు చెందిన పౌరులు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలోని కొంత మంది ఫాలోవర్ల నుంచి అతడికి ఓ రిక్వెస్ట్ వచ్చింది. ఉపయోగించిన సాక్సులు, అండర్‌వేర్‌లు, బట్టలను ఉతక్కుండానే తమకు అమ్మాలని కొందరు ఫాలోవర్లు కోరడంతో తొలుత అతడు షాకయ్యాడు. అనంతరం దాన్నే ఆదయవనరుగా మార్చుకున్నాడు. ఒక్కో జతను 10 నుంచి 30 పౌండ్ల చొప్పున వారంలో 12 జతల సాక్సులు అమ్ముతూ నెలకు 1600పౌండ్లు( సుమారు రూ.1.53లక్షలు), ఆర్జిస్తున్నాడు. 


కాగా.. కొన్నిరోజులపాటు వేసుకున్న సాక్సులను, అండర్‌వేర్లు, ఇతర దుస్తులను ఓ కవర్‌లో ప్యాక్ చేసి ఉంచి, కస్టమర్లకు పార్సల్ చేయనున్నట్టు చెప్పాడు. అమెరికన్లు తన వస్తువులను ఎక్కువగా ఇష్టపడతారని తెలిపాడు. ముఖ్యంగా LGBTQ+ కమ్యూనిటీకి చెందిన వారు తనకు సపోర్ట్‌గా నిలుస్తున్నట్టు వివరించాడు. ఫేస్‌బుక్, ఇన్‌స్టా‌గ్రాం, టిక్‌టాక్ తదితర సోషల్ మీడియా పేజీల్లో సైతం తనకు మంచి ఫాలోయింగ్ ఉందని పేర్కొన్నాడు. తాను చేస్తున్న ఈ వెరైటీ బిజినెస్‌కు కుటుంబ సభ్యులు కూడా సహకరిస్తున్నట్టు చెప్పాడు. ఇదిలా ఉంటే.. విడిచన దుస్తులతో బిల్లీ ఏడాదికి రూ.18లక్షలు సంపాదించడం ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. 


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.