Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Fri, 01 Jul 2022 20:02:42 IST

Viral Video: అంత పెద్ద ప్రమాదం జరిగినా.. రోడ్డుపై ఆసనాలు వేస్తున్న యువకుడు.. వీడికేమైనా పిచ్చా.. అంటున్న నెటిజన్లు..

twitter-iconwatsapp-iconfb-icon
Viral Video: అంత పెద్ద ప్రమాదం జరిగినా.. రోడ్డుపై ఆసనాలు వేస్తున్న యువకుడు.. వీడికేమైనా పిచ్చా.. అంటున్న నెటిజన్లు..

కొన్ని పెద్ద పెద్ద ప్రమాదాలు జరిగే సమయంలో అదృష్టవశాత్తు కొందరు ఎలాంటి గాయాలు కాకుండా బయటపడుతుంటారు. వీడికి భూమ్మీద నూకలు ఉన్నట్టున్నాయ్.. అని ఇలాంటి సందర్భాల్లోనే అంటూ ఉంటాం. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ యువకుడు కూడా అదృష్టవశాత్తు పెద్ద ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డాడు. అయితే బతుకు జీవుడా అని అక్కడి నుంచి వెళ్లకుండా.. నడి రోడ్డుపై యోగాసనాలు వేస్తున్నాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. వీడికేమైనా పిచ్చా.. అంటూ కామెంట్లు పెడుతున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఎప్పుడు, ఎక్కడ జరిగిందో ఏమో తెలీదు గానీ.. వాహనాల రాకపోకలతో ఓ రహదారి రద్దీగా ఉంటుంది. ఆ సమయంలో ఓ యువకుడు వాహనాలను గమనించకుండా.. బైక్‪‌పై రోడ్డు దాటడానికి ప్రయత్నిస్తాడు. రోడ్డు మధ్యలోకి రాగానే వేగంగా వచ్చిన ఓ కారు.. బైకుని బలంగా ఢీకొంటుంది. ఈ ప్రమాదంలో యువకుడు ఎగిరి దూరంగా పడతాడు. అయితే తలకు హెల్మెట్ ఉండడంతో ఎలాంటి గాయాలు కాకుండా బయటపడతాడు. బైకు మాత్రం నుజ్జు నుజ్జు అయిపోతుంది. ఇదిలావుండగా, అక్కడి నుంచి పక్కకు వెళ్లాల్సిన యువకుడు.. విచిత్రంగా రోడ్డుపైనే అటూ ఇటూ తిరుగుతూ ఆసనాలు వేయడాన్ని చూసి వాహనదారులు ఆశ్చర్యపోతారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. వీడికేమైనా పిచ్చా.. అంటూ కొందరు కామెంట్లు చేస్తుంటే.. ఆనందంతో అలా ఆసనాలు వేస్తున్నాడు.. అని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.

మూడు ఫైర్ కొరడాలను.. కళ్లు చెదిరేలా గింగిరాలు కొట్టించి.. ప్రపంచ రికార్డు కొట్టిన ఘనుడు.. చూస్తే ఆశ్చర్యపోతారు..



ఇవి కూడా చదవండిLatest News in Telugu

దుస్తులు కొని Google Pay ద్వారా డబ్బులు చెల్లించిన బాలిక.. మరుసటి రోజే ‘‘ఐ లవ్ యూ’’ అంటూ యువకుడి మెసేజ్.. చివరకు.. రండి మేడమ్! మేము లిఫ్ట్ ఇస్తాం.. అంటూ తల్లీకూతుళ్లను కారు ఎక్కించుకున్నారు.. కాస్త ముందుకు వెళ్లగానే.. Viral Video: వావ్! ఈ బుడ్డోడి టాలెంటే వేరు.. ఎంత బాగా మ్యాజిక్ చేశాడో చూడండి..videoఓ కర్రకు దుప్పటిని కట్టి.. అనారోగ్యంతో ఉన్న 75 ఏళ్ల తల్లిని అందులో పడుకోబెట్టి.. 5 కిలోమీటర్ల దూరం మోసుకెళ్లి..!Viral Video: చనిపోయిన తండ్రి పాత దుస్తులను.. మధుర జ్ఞాపకంగా మార్చిన కూతురు.. ప్రశంసల వర్షం కురిపిస్తున్న నెటిజన్లు..videoInstagram Reel తెచ్చిన తంటా.. సరదాగా ఫ్రెండ్స్‌తో కలిసి వీడియో చేస్తే దూల తీర్చేసిన పోలీసులు..!
Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.