రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

ABN , First Publish Date - 2021-07-25T04:49:33+05:30 IST

మండలంలోని పల్లవోలు గ్రామం వద్ద జాతీయ రహదారిపై శనివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో కటిక అబూబకర్‌ (36) అనే యువకుడు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

చాపాడు, జూలై 24:  మండలంలోని పల్లవోలు గ్రామం వద్ద జాతీయ రహదారిపై శనివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో కటిక అబూబకర్‌ (36) అనే యువకుడు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. అబూబకర్‌ కడప నగరంలోని నకాష్‌ వీధికి చెందినవాడు. ఇతను మోటారు సైకిల్‌పై ప్రొద్దుటూరుకు వెళుతుండగా ఎదురుగా వచ్చిన ఆవును ఢీకొనడంతో అదుపు తప్పి డివైడర్లు దాటి అవతలి ఉన్న రోడ్డుపై పడినట్లు తెలిపారు. అతను రోడ్డు మీద పడగానే వేగంగా వస్తున్న కారు అతడి తలను ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు వారు పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు.

Updated Date - 2021-07-25T04:49:33+05:30 IST