చెరువులో పడి యువకుడి ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-05-23T06:01:21+05:30 IST

బాజాభజంత్రీలు, మంగళవాయిద్యాలు మోగాల్సిన ఇంట్లో చావుడప్పులు మోగాయి. ఆదుకుంటాడనుకున్న కొడుకు అర్థవంతంగా తనువు చాలించి ఆ తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చాడు. దిలావర్‌పూర్‌ మండల కేంద్రానికి చెందిన కర్రోళ్ల సాయికృష్ణ(23) అనే యువకుడు కొత్త చె రువులో పడి ఆత్మహత్య చేసుకున్నాడు. సాయికృష్ణకు ఈ నెల 24వ తేదీన లో కేశ్వరం మండలానికి చెందిన యువతితో వివాహం జరగాల్సి ఉంది. బం ధువులకు, సన్నిహితులకు పెళ్లి పత్రికలు సైతం ఇచ్చారు. ఇంతలోనే సాయి కృష్ణ ఆత్మహత్యకు పాల్పడడంతో దిలావర్‌పూర్‌లో విషాదం అలుముకుంది. కాగా, పెళ్లి ఇష్టం లేనికారణంగానే సాయికృష్ణ ఆత్మహత్య చేసుకుని ఉంటాడని భావిస్తున్నారు. మరోవైపు తమకున్న రూ. ఐదు లక్షల అప్పు తీరిపోయాకనే పె ళ్లి చేసుకుంటానని కుటుంబ సభ్యులతో సాయికృష్ణ అనగా అందుకు తల్లిదం డ్రులు నీవు ముందు పెళ్లి చేసుకోవాలని, అప్పు గురించి నీవేమి ఆలోచిం చవద్దని, అప్పును తాము తీరుస్తామని నచ్చజెప్పి పెళ్లికి ఒప్పించారు. అయితే సాయికృష్ణ శనివారం రాత్రి తన ద్విచక్ర వాహనం తీసుకుని బయటకు వెళ్లి వస్తానని చెప్పి వెళ్లాడు. ఇంటికి తిరిగి రాలేదు. ఆదివారం ఉదయం గ్రామ సమీపంలో ఉన్న కొత్త చెరువు కట్టపై సాయ

చెరువులో పడి యువకుడి ఆత్మహత్య

దిలావర్‌పూర్‌, మే 22 : బాజాభజంత్రీలు, మంగళవాయిద్యాలు మోగాల్సిన ఇంట్లో చావుడప్పులు మోగాయి. ఆదుకుంటాడనుకున్న కొడుకు అర్థవంతంగా తనువు చాలించి ఆ తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చాడు. దిలావర్‌పూర్‌ మండల కేంద్రానికి చెందిన కర్రోళ్ల సాయికృష్ణ(23) అనే యువకుడు కొత్త చె రువులో పడి ఆత్మహత్య చేసుకున్నాడు. సాయికృష్ణకు ఈ నెల 24వ తేదీన లో కేశ్వరం మండలానికి చెందిన యువతితో వివాహం జరగాల్సి ఉంది. బం ధువులకు, సన్నిహితులకు పెళ్లి పత్రికలు సైతం ఇచ్చారు. ఇంతలోనే సాయి కృష్ణ ఆత్మహత్యకు పాల్పడడంతో దిలావర్‌పూర్‌లో విషాదం అలుముకుంది. కాగా, పెళ్లి ఇష్టం లేనికారణంగానే సాయికృష్ణ ఆత్మహత్య చేసుకుని ఉంటాడని భావిస్తున్నారు. మరోవైపు తమకున్న రూ. ఐదు లక్షల అప్పు తీరిపోయాకనే పె ళ్లి చేసుకుంటానని కుటుంబ సభ్యులతో సాయికృష్ణ అనగా అందుకు తల్లిదం  డ్రులు నీవు ముందు పెళ్లి చేసుకోవాలని, అప్పు గురించి నీవేమి ఆలోచిం చవద్దని, అప్పును తాము తీరుస్తామని నచ్చజెప్పి పెళ్లికి ఒప్పించారు. అయితే సాయికృష్ణ శనివారం రాత్రి తన ద్విచక్ర వాహనం తీసుకుని బయటకు వెళ్లి వస్తానని చెప్పి వెళ్లాడు. ఇంటికి తిరిగి రాలేదు. ఆదివారం ఉదయం గ్రామ సమీపంలో ఉన్న కొత్త చెరువు కట్టపై సాయికృష్ణ ద్విచక్ర వాహనం, చెప్పులు ఉండడంతో స్థానికులు కుటుంబసభ్యులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్సై గంగాధర్‌ మత్స్యకారులతో చెరువులో వెతికించగా మృతదేహం బయ టపడింది. కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. 

Updated Date - 2022-05-23T06:01:21+05:30 IST