క్రిప్టోలో లక్షలు పోగొట్టుకుని యువకుడి ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-11-26T09:55:10+05:30 IST

సులభంగా కోట్లు సంపాదించాలన్న ఆశ.. అతడ్ని ఆన్‌లైన్‌ కరెన్సీ వ్యాపా రం వైపు మళ్లించింది. క్రిప్టో కరెన్సీలో లక్షలు పెట్టుబడి పెట్టే లా చేసింది.

క్రిప్టోలో లక్షలు పోగొట్టుకుని యువకుడి ఆత్మహత్య

ఖమ్మం, నవంబరు 25 (ఆంధ్రజ్యోతిప్రతినిధి): సులభంగా కోట్లు సంపాదించాలన్న ఆశ.. అతడ్ని ఆన్‌లైన్‌ కరెన్సీ వ్యాపా రం వైపు మళ్లించింది. క్రిప్టో కరెన్సీలో లక్షలు పెట్టుబడి పెట్టే లా చేసింది. చివరకు ప్రాణాలు తీసింది. బాధితుడి బంధువు లు చెప్పిన వివరాల ప్రకారం.. ఖమ్మానికి చెందిన గుండెమెడ రామలింగస్వామి(36) క్రిప్టో కరెన్సీ వ్యాపారంలో లక్షలు పెట్టుబడి పెట్టాడు. తెలిసిన ఇద్దరు వ్యక్తులతోనూ రూ.70 లక్షల కు పైగా పెట్టుబడి పెట్టించాడు. ఈ వ్యాపారం తలకిందులు కావడంతో నష్టపోయాడు. కానీ, వ్యాపారంలో పెట్టుబడులు పెట్టిన వాళ్లు మాత్రం తమ డబ్బు తిరిగి చెల్లించాల్సిందిగా ఒత్తిడి తెచ్చారు. బెదిరించి, బలవంతంగా చెక్కులు తీసుకోవడంతో కారు, ఆస్తులు స్వాధీనం చేసుకున్నారు. అప్పటికీ అప్పుతీరలేదని మరో పదిలక్షలు ఇవ్వాలని ఒత్తిడి తెచ్చారు. కలత చెందిన రామలింగసూర్యాపేటలోని ఓలాడ్జిలో గది తీసుకుని నిద్రమాత్రలు మింగడంతో పాటు పురుగుల మందు తా గి ఆత్మహత్య చేసుకున్నాడు. తన భార్యకు రాసిన లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. క్రిప్టో కరెన్సీ వ్యా పారంలో నష్టాలు రావడం, తనతో పాటు నష్టపోయిన వాళ్ల ఒత్తిడి చేయడం వల్లే ఆత్మహత్యకు పాల్పడుతున్నానని లేఖలో పేర్కొన్నాడు.

Updated Date - 2021-11-26T09:55:10+05:30 IST