HYD : గుడికి వెళ్లొస్తానని చెప్పి ఇంట్లో నుంచి బయటికెళ్లిన యువతి అదృశ్యం

ABN , First Publish Date - 2021-09-03T14:56:59+05:30 IST

గత నెల 22న గుడికి వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పి వెళ్లిపోయింది. తిరిగి రాలేదు.

HYD : గుడికి వెళ్లొస్తానని చెప్పి ఇంట్లో నుంచి బయటికెళ్లిన యువతి అదృశ్యం

హైదరాబాద్ సిటీ/అడ్డగుట్ట : గుడికెళ్లిన ఓ యువతి అదృశ్యమైంది. లాలాగూడ ఎస్సై రవీందర్‌ కథనం ప్రకారం.. నార్త్‌లాలాగూడ శాంతినగర్‌కు చెందిన పి.శారద కుమార్తె పి.కల్పలత(24) డిగ్రీ చదువుతోంది. గత నెల 22న గుడికి వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పి వెళ్లిపోయింది. తిరిగి రాలేదు. తల్లి బంధువులు, స్నేహితుల ఇంట్లో వెతికినా ఆచూకీ లభించలేదు. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 


Updated Date - 2021-09-03T14:56:59+05:30 IST