Advertisement
Advertisement
Abn logo
Advertisement

శంషాబాద్‌లో బైక్‌ ఢీకొని యువతి మృతి

హైదరాబాద్/శంషాబాద్‌ : శంషాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలోని రాళ్లగూడ-దొడ్డి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంతో బైక్‌ ఢీకొని ఓ యువతి అక్కడికక్కడే మృతి చెందింది. మోటార్‌సైకిల్‌ను ఓ వ్యక్తి మద్యం మత్తులో నడుపడం వల్లనే ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. శంషాబాద్‌ మండలం, చౌదరిగూడ గ్రామానికి చెందిన మల్లేష్‌ శంషాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో సెక్యూరిటీ గార్డు. సోమవారం మల్లేష్‌ తన బైక్‌పై చౌదరిగూడ నుంచి శంషాబాద్‌ వైపునకు వస్తూ రాళ్లగూడ-దొడ్డి వద్ద మమత(19)ని డీకొట్టాడు. ఈ ప్రమాదంలో తలకు తీవ్రగాయాలైన మమత అక్కడికక్కడే మృతిచెందింది. మృతురాలికి కొన్ని నెలల క్రితమే వివాహం జరిగిందని బస్తీవాసులు తెలిపారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. స్థానికుల సమాచారంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించగా అతను మద్యం సేవించి బైక్‌ నడిపినట్టు తేలింది. దీంతో నింధితున్ని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు.

Advertisement
Advertisement