క్వార్టర్స్‌లో యువ భారత్‌

ABN , First Publish Date - 2022-01-21T08:52:11+05:30 IST

అండర్‌-19 వరల్డ్‌క్‌పలో యువ భారత్‌ క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. కెప్టెన్‌ యశ్‌సహా ఆరుగురు ఆటగాళ్లు కొవిడ్‌ కారణంగా దూరం కాగా...

క్వార్టర్స్‌లో యువ భారత్‌

174 పరుగులతో ఐర్లాండ్‌పై ఘన విజయం

తరౌబా (ట్రినిడాడ్‌): అండర్‌-19 వరల్డ్‌క్‌పలో యువ భారత్‌ క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. కెప్టెన్‌ యశ్‌సహా ఆరుగురు ఆటగాళ్లు కొవిడ్‌ కారణంగా దూరం కాగా.. అరకొర జట్టుతో బరిలోకి దిగిన టీమిండియా 174 పరుగులతో పసికూన ఐర్లాండ్‌ను చిత్తుచేసింది. తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై నెగ్గిన భారత్‌.. మరో మ్యాచ్‌ మిగిలుండగానే మొత్తం 4 పాయింట్లతో గ్రూప్‌-బి నుంచి క్వార్టర్స్‌ బెర్త్‌ ఖరారు చేసుకొంది. బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 307 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్లు హర్నూర్‌ సింగ్‌ (101 బంతుల్లో 12 ఫోర్లతో 88), రఘువంశీ (79 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్‌లతో 79) అర్ధ శతకాలతో అదరగొట్టారు. ముజమిల్‌ షెర్‌జాద్‌ మూడు వికెట్లు పడగొట్టాడు. అనంతరం ఛేదనలో ఐర్లాండ్‌ 39 ఓవర్లలో 133 పరుగులకే కుప్పకూలింది. స్కాట్‌మెక్‌బెత్‌ (32) టాప్‌ స్కోరర్‌. గర్వ్‌ సంగ్వాన్‌, గౌతమ్‌, తాంబే చెరి రెండు వికెట్లు పడగొట్టారు. గ్రూప్‌-డిలో జరిగిన మ్యాచ్‌లో ఆస్ర్టేలియా 7 వికెట్లతో స్కాట్లాండ్‌పై గెలిచింది. టేగ్‌ విలి సెంచరీ చేశాడు. 

సంక్షిప్త స్కోర్లు: భారత్‌: 50 ఓవర్లలో 307/5 (హర్నూర్‌ సింగ్‌ 88, రఘువంశీ 79; ముజమిల్‌ షెర్‌జాద్‌ 3/79); ఐర్లాండ్‌: 39 ఓవర్లలో 133 ఆలౌట్‌ (మెక్‌బెత్‌ 32, కాక్స్‌ 28; తాంబే 2/8, గౌతమ్‌ 2/11, సంగ్వాన్‌ 2/23). 

Updated Date - 2022-01-21T08:52:11+05:30 IST