వయసులో చిన్న... ప్రతిభలో మిన్న

ABN , First Publish Date - 2020-09-16T05:00:27+05:30 IST

ఈ చిన్నారికి రెండేళ్లు కూడా నిండలేదు. కానీ తన

వయసులో చిన్న... ప్రతిభలో మిన్న

ఈ చిన్నారికి రెండేళ్లు కూడా నిండలేదు. కానీ తన ప్రతిభతో ‘ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో’ స్థానం సంపాదించాడు. పుణేకు చెందిన నభా అనంత్‌ నెర్కర్‌ వయస్సు 20 నెలలు. కానీ ఇతడి జ్ఞాపకశక్తి మాత్రం చాలా ఘనం.


 ఇంకో నాలుగు నెలలు గడిస్తే రెండో పుట్టిన రోజు జరుపుకొనే ఈ బుడతడు తన అద్భుతమైన ప్రతిభతో ఆకట్టుకుంటున్నాడు. 20 నెలల వయసంటే బుడి బుడి అడుగులు వేస్తూ, చిన్నచిన్న మాటలు మాట్లాడతారు. ఈ చిన్నారి మాత్రం 14 రకాల కూరగాయలను గుర్తుపడతాడు.


 10 రకాల పండ్లు, శరీరంలోని 15 రకాల అవయవాలు, ఇంట్లో 40 రకాల వస్తువులు, 16 రకాల ఆహారపదార్థాలు, కుటుంబ సభ్యుల నిక్‌నేమ్స్‌ను టకా టకా చెప్పేస్తాడు. అంతేకాదు, ఎనిమిది రకాల జంతువులు, పక్షుల అరుపులను అనుకరిస్తాడు. 


 ఈ చిన్నారి ప్రతిభను చూసి ‘ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’ ప్రతినిధులు ముగ్ధులవడమే కాదు ఇతడి పేరును రికార్డుల్లోకి ఎక్కించారు. 


Updated Date - 2020-09-16T05:00:27+05:30 IST