యువ ఇంజనీర్లు పరిశోధనల వైపు వెళ్లాలి

ABN , First Publish Date - 2022-08-12T06:29:45+05:30 IST

యువ ఇంజనీర్లు పరిశోధనలపై దృష్టి పెట్టి నూతన ఆవి ష్కరణలకు శ్రీకారం చుట్టాలని అనంతపురం జేఎన్‌టీయూ వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ జి.రంగ జనార్దన్‌ అన్నారు.

యువ ఇంజనీర్లు పరిశోధనల వైపు వెళ్లాలి

అనంతపురం జేఎన్‌టీయూ వైస్‌ చాన్సలర్‌ రంగ జనార్దన్‌

కర్నూలు(ఎడ్యుకేషన్‌), ఆగస్టు 11: యువ ఇంజనీర్లు పరిశోధనలపై దృష్టి పెట్టి నూతన ఆవి ష్కరణలకు శ్రీకారం చుట్టాలని అనంతపురం జేఎన్‌టీయూ వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ జి.రంగ జనార్దన్‌ అన్నారు. గురువారం స్థానిక వెంకాయపల్లె సమీపంలో ఉన్న జి.పుల్లయ్య ఇంజనీరింగ్‌ కళాశాలలో 2018-2022 బ్యాచ్‌కు చెందిన బీటెక్‌ విద్యార్థులకు ప్రఽథమ గ్రాడ్యుయేషన్‌ డే రవీంద్ర విద్యాసంస్థల చైర్మన్‌ జీవీఎం మోహన్‌ కుమార్‌ అధ్యక్షతన జరిగింది. బీటెక్‌ కోర్సు పూర్తి చేసిన పూర్వ విద్యార్థులకు రంగజనార్దన్‌ డిగ్రీ పట్టాలను ప్రదానం చేశారు. ఈసందర్భంగా రంగజనార్దన్‌ మాట్లాడుతూ యువ ఇంజనీరు జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనే ధైర్య ముండాలన్నారు. అనంతరం విశిష్ట అతిథులు డా.యు.చంద్రశేఖర్‌, టీసీఎస్‌ గ్లోబల్‌ హెచ్‌వోడీ డా.ఈఎస్‌ చక్రవర్తి మాట్లాడుతూ విద్యార్థులు పరిశ్రమలు నెలకొల్పడానికి కావాల్సిన నైపుణ్యాలు కళాశాలలోనే పొం దినప్పుడు తమ జీవితం ఉన్నతంగా ఉం టుందని తెలిపారు. అనంతరం బ్రాంచ్‌ టాపర్స్‌కు విద్యార్థులలో ఉత్తమ మార్కులు సాధించిన వారికి గోల్డ్‌మెడల్‌ను ప్రదానం చేశారు. కార్యక్రమంలో రవీంద్ర విద్యా సంస్థల వ్యవస్థాపకుడు జి.పుల్లయ్య, వైస్‌ చైర్మన్‌ వంశీధర్‌, గోపి, ప్రిన్సిపాల్‌ శ్రీని వాసమూర్తి, విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.


Updated Date - 2022-08-12T06:29:45+05:30 IST