అన్ని ఫార్మాట్లు ఆడే సత్తా ఉంది

ABN , First Publish Date - 2022-05-18T09:33:20+05:30 IST

హైదరాబాద్‌కు చెందిన యువ క్రికెటర్‌ తిలక్‌ వర్మ ఆటతీరును మాజీ కెప్టెన్‌ సునీల్‌ గవాస్కర్‌ కొనియాడాడు. టీమిండియా తరఫున మూడు ఫార్మాట్లలోనూ ఆడగలిగే..

అన్ని ఫార్మాట్లు ఆడే సత్తా ఉంది

తిలక్‌ వర్మకు సన్నీ ప్రశంస


ముంబై: హైదరాబాద్‌కు చెందిన యువ క్రికెటర్‌ తిలక్‌ వర్మ ఆటతీరును మాజీ కెప్టెన్‌ సునీల్‌ గవాస్కర్‌ కొనియాడాడు. టీమిండియా తరఫున మూడు ఫార్మాట్లలోనూ ఆడగలిగే సత్తా అతడికి ఉందని తెలిపాడు. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కూడా ఇటీవల ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ‘తిలక్‌ చాలా పరిణతితో ఆడుతున్నాడు. సాంకేతికంగా అతడిలో తప్పు పట్టడానికి ఏమీ లేదు. స్ట్రయిక్‌ రొటేట్‌ చేస్తూ సింగిల్స్‌తో పాటు భారీ షాట్లు కూడా ఆడగల నైపుణ్యం ఉంది. దీంతో అతడికి క్రికెట్‌ పరిజ్ఞానం ఎక్కువే అని తెలుస్తోంది. ఫిట్‌నె్‌సను కాపాడుకుంటే భారత్‌ తరఫున అన్ని ఫార్మాట్లలోనూ ఆడగలడు’ అని గవాస్కర్‌ చెప్పుకొచ్చాడు.

Updated Date - 2022-05-18T09:33:20+05:30 IST