యుగపురుషుడు ఎన్టీఆర్‌

ABN , First Publish Date - 2022-05-29T06:07:38+05:30 IST

యుగపురుషుడు ఎన్టీఆర్‌

యుగపురుషుడు ఎన్టీఆర్‌
గన్నవరం టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళులర్పిస్తున్న ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు, టీడీపీ నాయకులు

 గన్నవరం, మే 28: పేదలకు కూడు, గూడు, గుడ్డ కిలో బియ్యం రూ.2లకే అందజేసిన యుగపురుషుడు నందమూరి తారక రామారావు అని టీడీపీ ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు అన్నారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో శనివారం ఎన్టీఆర్‌ శత జయంతి వేడుకలు నిర్వహించి విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. టీడీపీ నాయకులు జాస్తి వెంకటేశ్వరరావు, యలమందల సతీష్‌, జాస్తి శ్రీధర్‌రావు మండవ లక్ష్మీ, పలగాని వేణు పాల్గొన్నారు. పట్టణంలోని ఎన్టీఆర్‌ విగ్రహానికి నాయకులు బొడ్డపాటి రాంబాబు, పాతూరి ప్రసాద్‌ పూలమాలలు వేశారు. ముస్తాబాద, పురు షోత్తప ట్నంలో ఎన్టీఆర్‌ విగ్రహానికి  పార్టీ నాయకులు  పూల మాలలు వేసి నివాళులర్పించారు. తాడిశెట్టి శ్రీనివాసరావు, గుత్తి కొండయ్య, కొమ్మినేని రాజా, మాదల సాంబశివరావు, మోపర్తి కోటేశ్వరరావు, నక్కా శ్రీను, బొద్దులూరి శ్యాంబాబు, చల్లపల్లి సుధాకర్‌, కుంటముక్కల శివయ్య పాల్గొన్నారు.

ఈడుపుగల్లు (కంకిపాడు) : ఏ రంగంలో అయినా ఎన్టీఆర్‌కు ఎన్టీఆరే సాటి అని మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్ర ప్రసాద్‌అన్నారు. ఈడుపుగల్లులో మాజీ ఎంపీపీ దేవినేని రాజా వెంకటేశ్వరప్రసాద్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకల్లో శనివారం ఆయన పాల్గొన్నారు. ముందుగా రక్తదాన శిబిరాన్ని, అన్నదాన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.  టీడీపీ నాయకులు వెలగపూడి శంకర్‌బాబు, బోడె సురేష్‌, సర్పంచ్‌ పి. ఇందిర, షేక్‌ మాబు సుబాని, షేక్‌ షకార్‌, పుట్టగుంట రవి, పి. సుధాకర్‌, రావి సురేష్‌ బాబు, బాజి తదితరులు పాల్గొన్నారు. కంకిపాడులో టీడీపీ కార్యాల య బాధ్యుడు బొప్పూడి శివరామకృష్ణ ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.   తుమ్మల పల్లి హరికృష్ణ జెండా ఆవిష్కరించి కేక్‌ కట్‌ చేశారు.   పార్టీ నాయకులు సుదిమళ్ల రవీంద్ర, అన్నే ధనయ్య, యలమంచిలి కిషోర్‌బాబు, కొణతం సుబ్రహ్మణ్యం, కొండ వీటి శివయ్య,  విక్రం, రంజిత్‌, డీఎన్‌ఆర్‌, పులి శ్రీనివాసరావు, కొండా నాగేశ్వరరావు, పాల్గొన్నారు. గొడవర్రులో నిర్వహించిన ఎన్టీఆర్‌ శత జయంతి వేడుకల్లో మాజీ సర్పంచ్‌ కోనేరు భాను ప్రసాద్‌, బోస్‌, సాంబయ్య, రాజేష్‌, బి. దుర్గా ప్రసాద్‌, ప్రసాద్‌,. వై. కృష్ణారావు, మాదు వెంకటేశ్వరరావు, కొల్లి భాస్కర్‌ పాల్గొన్నారు. 

ఉయ్యూరు : కళలు, కళాకారులను ప్రోత్సహించిన కళాతపస్వి ఎన్టీఆర్‌ అని ఉయ్యూరు మాజీ చైర్మన్‌ జంపాన పూర్ణచంద్రరావు కొనియాడారు. ఎన్టీఆర్‌ జయంతి పురస్క రించుకునిమార్కెట్‌ సెంటర్‌ వద్ద నాటకరంగ కళాకారులతో కలసి ఎన్టీఆర్‌ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పిం చారు. ఈ సందర్భంగా పౌరాణిక నాటక రంగ కళాకారులైన కమలకుమారి, నాంచారయ్య నాయుడు, డి.బాబూరావు, జి.సుబ్బారావు, ఎన్‌.రాములను దుశ్శాలువాలతో ఘనంగా సత్కరించారు. అర్జునరావు, రుద్రయ్య పాల్గొన్నారు. ఉయ్యూరు మార్కెట్‌లో జంపాన పూలా ఆధ్వర్యంలో  టీడీపీ నాయకులు,  వ్యాపారులు ఎన్టీఆర్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళుల ర్పించారు. జయదేవ్‌, చిరంజీవి, కౌన్సిలర్‌ పలియాల శ్రీనివాసరావు, బూరెల నరేష్‌ పాల్గొన్నారు. పెదఓగిరాలలో పోతిరెడ్డి ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ముదునూరులో ఎన్టీఆర్‌ విగ్రహానికి దండమూడి చౌదరి పూలమాలవేసి నివాళులర్పించారు.  

పెనమలూరు  : ఎన్టీఆర్‌ శత జయంతిని పురస్కరిం చుకుని శనివారం  మండలంలోని గ్రామ గ్రామాన ఘనంగా వేడుకలను నిర్వహించారు. ఎన్టీఆర్‌ చిత్రపటానికి, విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ తాడిగడప మున్సిపల్‌ అధ్యక్షుడు అనుమోలు ప్రభాకరరావు ఆధ్వర్యంలో పోరంకిలోని టీడీపీ కార్యాలయం, కానూరు, పెనమలూరు గ్రామాల్లోని ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద నివాళులర్పించారు.   నాయకులు వెలగపూడి శంకరబాబు, దోనేపూడి రవికిరణ్‌, కోయా ఆనంద్‌, షేక్‌ బుజ్జి, ద్రోణవల్లి సుబ్బారావు, అంగిరేకుల మురళి, కాట్రగడ్డ లీలాప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. యన మలకుదురులోని ఎన్టీఆర్‌ గార్డెన్స్‌లో వేడుకలను  మొక్కపాటి శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎన్టీ రామారావు జయంతిని పుర స్కరించుకుని చోడవరంలో శనివారం ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. గ్రామ పార్టీ అధ్యక్షుడు కలపాల శ్రీథర్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో గ్రామా నికి చెందిన సుమారు 300 మంది పాల్గొన్నారు. 

విజయవాడ రూరల్‌  :  ఎన్‌టీఆర్‌ శత జయంతి ఉత్సవాలలో భాగంగా విజయవాడ రూరల్‌లోని పలు గ్రామాలలో ఆయన జయంతి వేడుకలను శనివారం నిర్వహించారు. పాతపాడులో ఎన్‌టీఆర్‌ చిత్రపటానికి పార్టీ నాయకుడు  బెజవాడ నాగేశ్వరరావు, నున్నలో  గంపా శ్రీనివాస్‌ యాదవ్‌,   అంగ జాల శివయ్య పూలమాల వేసి నివాళులర్పించారు.   పీ నైనవరం, అంబాపురం, కొత్తూరు తాడేపల్లి, జక్కంపూడి గ్రామాల్లోనూ ఎన్‌టీఆర్‌ జయంతి వేడుకలు జరిగాయి.  తెలుగు యువత మండల అధ్యక్షుడు గంపా శ్రీనివాస్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో అంగజాల శివయ్య, బేతపూడి శ్రీనివాసరావు, బొకినాల తిరుపతిరావు, తరుణ్‌ తదితరులు ఒంగోలు వెళ్లారు. 

హనుమాన్‌జంక్షన్‌  : తెలుగు జాతి ఉన్నంత వరకు ఎన్టీఆర్‌ యుగపురుషుడిగా మిగిలిపోతారని విజయ డెయిరీ చైర్మన్‌ చలసాని ఆంజనేయులు అన్నారు. శనివారం స్థానిక కాకాని కల్యాణ మండపంలోని ఎన్డీఆర్‌ విగ్రహానికి గజ మాల తో నివాళులర్పించారు. ఎన్టీఆర్‌తో పాటు కాకాని విగ్రహానికి కూడా చలసాని పూలమాలవేసి నివాళి అర్పించారు.  కొల్లి రంగారావు, లింగం శ్రీధర్‌, కసుకుర్తి  నిరంజనరావు, మొవ్వా శ్రీనివాసరావు,  కిషోర్‌,  సంపత్‌కుమార్‌ పాల్గొన్నారు.

దయాల రాజేశ్వరరావు నాయకత్వంలో శనివారం హనుమాన్‌ జంక్షన్‌లో ఎన్టీఆర్‌ జయంతి నిర్వహించారు. నేతలు వేముపల్లి శ్రీనివాసరావు, చెన్నుబోయన శివయ్య, వేగిరెడ్డిపాపారావు, మజ్జిగనాగరాజు, కలపాల సూర్యనారాయణ, అట్లూరి శ్రీనివాసరావు, ఆత్కూరి కొండలరావు పాల్గొన్నారు.  

హనుమాన్‌జంక్షన్‌ రూరల్‌ :   బాపులపాడు మండల గ్రామాల్లో ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాలను శనివారం టీడీపీ శ్రేణులతో పాటు రాజకీయాలకతీతంగా కృష్ణామిల్క్‌ యూని యన్‌ సభ్యులు సేవలతో ఘనంగా నిర్వహించారు.   ఈ కార్యక్రమంలో పిన్నమనేని లక్ష్మీప్రసాద్‌,  లింగం శ్రీధర్‌,   కొల్లి రంగారావు, మేనేజర్‌ వి.వి.సంపత్‌కుమార్‌ పాల్గొన్నారు. వీరవల్లి కూడలిలోని ఎన్టీఆర్‌ విగ్రహానికి లంక సురేంద్ర మోహనబెనర్జీ నిలువెత్తు పూలమాలతో నివాళులర్పించారు.   రంగన్నగూడెంలో మొవ్వా వేణుగోపాల్‌,   పుసులూరి లక్ష్మీనారాయణ,  మైనేని గోపాలరావు ఎన్టీఆర్‌ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు

Updated Date - 2022-05-29T06:07:38+05:30 IST