మేం తల్చుకుంటే మీకు మూడుతుంది... పాశ్చాత్య దేశాలకు రష్యా హెచ్చరిక...

ABN , First Publish Date - 2022-03-09T21:49:01+05:30 IST

ఉక్రెయిన్‌పై యుద్ధం నేపథ్యంలో తమపై విధించిన ఆంక్షలకు

మేం తల్చుకుంటే మీకు మూడుతుంది... పాశ్చాత్య దేశాలకు రష్యా హెచ్చరిక...

మాస్కో : ఉక్రెయిన్‌పై యుద్ధం నేపథ్యంలో తమపై విధించిన ఆంక్షలకు విస్తృత స్థాయిలో స్పందిస్తామని రష్యా హెచ్చరించింది. పాశ్చాత్య దేశాలకు నొప్పి తెలిసే విధంగా  ఆంక్షలు విధిస్తామని తెలిపింది. రష్యా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని ఆర్థిక సహకార విభాగం డైరెక్టర్ దిమిత్రి బిరిచెవ్‌స్కీ ఈ హెచ్చరిక చేశారు. 


ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రారంభమైంది. ఆ తర్వాత 10 రోజుల్లో రష్యాపై అనేక పాశ్చాత్య దేశాలు 2,700కు పైగా ఆంక్షలను విధించాయి. మొత్తం మీద ప్రపంచంలో అత్యధిక ఆంక్షలను ఎదుర్కొంటున్న దేశంగా రష్యా రికార్డు సృష్టించింది. రష్యాపై ప్రస్తుతం 5,500కుపైగా ఆంక్షలు అమలవుతున్నాయి. ఇరాన్, ఉత్తర కొరియాల కన్నా ఎక్కువ ఆంక్షలను ఎదుర్కొంటోంది. 


ఈ నేపథ్యంలో దిమిత్రి బిరిచెవ్‌స్కీ ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, రష్యా ప్రతిస్పందన అత్యంత వేగంగా, కచ్చితంగా ఉంటుందన్నారు. వాటిని ఎదుర్కొనేవారికి నొప్పి తెలుస్తుందన్నారు. తాము విధించవలసిన ఆంక్షలపై సమాలోచనలు జరుగుతున్నాయని చెప్పారు. 


Updated Date - 2022-03-09T21:49:01+05:30 IST