Advertisement
Advertisement
Abn logo
Advertisement

Kuwait లో ఎడమ చేతితో తినకూడదా..? ఆ దేశంలో ఉండగా ఏమేం చేయకూడదంటే..

కువైత్ సిటీ: గల్ఫ్ దేశాలంటేనే అందమైన కట్టడాలతో చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. పర్యాటకులను ఇట్టే కట్టిపడేస్తుంటాయి. ఇక రక్షణ, భద్రత విషయంలో కూడా ఎలాంటి ఢోకా ఉండదు. అందుకే చాలామంది విదేశీయులు తమ కుటుంబాలతో కలిసి కొన్ని రోజులు హాయిగా గడిపేందుకు గల్ఫ్ దేశాలకు అధికంగా వెళ్తుంటారు. ఇక అక్కడి సంస్కృతి, వేషధారణ, నియమనిబంధనలు ఇతర దేశాల కంటే కూడా పూర్తి భిన్నంగా ఉంటాయి. కనుక ఆ దేశాలకు వెళ్లేముందు వాటిపై కొంచెం అవగాహన ఉండడం మంచిది. ఇక కువైత్ కూడా ఇదే కోవలోకి వస్తుంది. పర్యాటకులను విశేషంగా ఆకర్షించే కువైత్‌లో భిన్నమైన సంస్కృతి ఉంటుంది. కనుక కువైత్ పర్యటనకు వెళ్లేవారు అక్కడ చేయకూడని, తప్పకుండా పాటించాల్సిన కొన్ని విషయాలను తెలుసుకోవడం బెటర్. 

కువైత్ పౌరులు చాలా వరకు మర్యాదపూర్వకంగానే ఉంటారు. వారి దేశానికి వెళ్లేవారు అక్కడి కల్చర్, నిబంధనలను సరిగ్గా పాటిస్తే సరిపోతుంది. ఉదాహరణకు డ్రెస్సింగ్. అక్కడ రెండు రకాల డ్రెస్సింగ్ స్టైల్స్ కనిపిస్తుంటాయి. ఒకటి కువైటీలది, రెండోది విజిటర్లది. అరబ్ మహిళలు ఇంటి నుంచి బయటకు వస్తే వారి ట్రేడిషనల్ దుస్తుల్లోనే కనిపిస్తారు. అదే బుర్ఖా. తల భాగం నుంచి కాలి వరకు మొత్తం బుర్ఖాలోనే కప్పబడి ఉంటాయి. కొందరు చేతులకు కూడా గ్లౌజులాంటివి ధరిస్తుంటారు. ఇక పర్యాటకులు తమకు నచ్చిన వేషధారణలో బయటకు వెళ్లొచ్చు. కానీ, మహిళలు బిగుతుగా ఉండే దస్తులు, పొట్టి జీన్స్ లాంటివి ధరించకూడదు. కాగా, అరబ్ పురుషులు ఎప్పుడూ తెల్లటి 'తోబ్'(పైజామా) లాంటివే వేసుకుంటారు. ఎలాంటి ప్రత్యేక కార్యక్రమమైన తోబ్‌నే ధరిస్తారు. కానీ, బయటి దేశాలకు చెందిన మగాళ్లు తోబ్ వేసుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే స్లీవ్‌లెస్ షర్ట్స్, షార్ట్స్ వంటివి బయటకు వచ్చినప్పుడు ధరించకూడదు. 


ఇవి కూడా చదవండి..

Kuwait కు వెళ్తున్నారా..? పొరపాటున కూడా వీటిని తీసుకెళ్లొద్దు..!

ఇకపై NRI లకు పిల్లలను దత్తత తీసుకోవడం చాలా సులువు..

కాళ్లు, చేతుల విషయంలోనూ ప్రత్యేక నిబంధనలు..

వేరే వాళ్ల ఇంటికి భోజనానికి వెళ్లినప్పుడు ఈ విషయం కచ్చితంగా గుర్తు పెట్టుకోండి. అదేంటంటే.. ఎడమ చేతితో తినకూడదు. దీన్ని వారు అసలు అంగీకరించరు. ఎందుకంటే వారు ఎడమ చేతితో తినడం, తాగడాన్ని అపరిశుభ్రంగా భావిస్తారు. ఇక కాళ్ల విషయానికి వస్తే.. కాళ్లకు బూట్లు వేసుకుని ఉన్నప్పుడు ఎట్టిపరిస్థితిలో కింది భాగం కనిపించేలా కాలిని అడ్డంగా పెట్టకండి. ఇలా చేయడాన్ని వారు ఒప్పుకొరు. ఈ చర్యను వారు ఎదుటివారిని అవమానించడంగా భావిస్తారు.


కువైటీలు ఎవరైనా తమ ఇంటికి ఆహ్వానిస్తే తప్పకుండా వెళ్లండి. ఎందుకంటే వారు ఇంట్లో పాటించే నియమ నిబంధనలు తెలుసుకునే వీలు ఉంటుంది. అలాగే కువైత్ సంస్కృతిని అర్థం చేసుకోవడాన్ని సహకరిస్తుంది కూడా. కాకపోతే ఆ సమయంలో మతపరమైన, రాజకీయపరమైన విషయాలను చర్చించడం చేయకపోతే చాలా మంచిది. 


కువైత్‌లో ఉన్నప్పుడు చేయకూడని ఇంకా కొన్ని పనులివే..

* బహిరంగా ప్రదేశాల్లో మత్తుపానీయాలు తీసుకెళ్లొద్దు. అలాగే అరబ్‌లను మద్యం తాగమని అడగొద్దు. ఎందుకంటే వారిలో డ్రింక్ చేయనివారు ఉంటే మీ పట్ల వారికి తప్పుడు అభిప్రాయం ఏర్పడే అవకాశం ఉంటుంది. 

* ప్రేయర్ మ్యాట్‌పై నడవొద్దు. అలాగే ప్రేయర్ జరుగుతున్నప్పుడు వారికి డిస్ట్రబ్ చేయకూడదు. 

* అనుమతి లేకుండా మసీదులో వెళ్లకూడదు. 

*రంజాన్ సమయంలో బహిరంగ ప్రదేశాల్లో తినడం, తాగడం, స్మోకింగ్ లాంటివి చేయకూడదు.  


ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement