Assam:పెట్రో ధరల పెంపుపై కేంద్ర సహాయమంత్రి సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2021-10-13T13:26:59+05:30 IST

దేశంలో పెట్రో ధరల పెంపుపై కేంద్ర పెట్రోలియం శాఖ సహాయమంత్రి రామేశ్వర్ సంచలన వ్యాఖ్యలు చేశారు...

Assam:పెట్రో ధరల పెంపుపై కేంద్ర సహాయమంత్రి సంచలన వ్యాఖ్యలు

 మీరు ఉచిత వ్యాక్సిన్ తీసుకున్నారు కదా...

గౌహతి :దేశంలో పెట్రో ధరల పెంపుపై కేంద్ర పెట్రోలియం శాఖ సహాయమంత్రి రామేశ్వర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రప్రభుత్వం ప్రజలకు ఉచితంగా కొవిడ్ టీకాలు వేస్తుందని, ఆ మొత్తాన్ని పెట్రోలు, డీజిల్ పై పన్నులు విధించడం ద్వారా వసూలు చేస్తుందని కేంద్ర సహాయమంత్రి రామేశ్వర్ చెప్పారు. ఇంధన ధరలు అంత ఎక్కువగా లేవని,ప్రజలకు ఉచిత వ్యాక్సిన్ ఇవ్వాలంటే డబ్బు ఎక్కడ నుంచి వస్తుందని మంత్రి ప్రశ్నించారు. ప్రజలు డబ్బు చెల్లించకుంటే ఇలా పెట్రో పన్నుల రూపంలో వసూలు చేయాల్సి వస్తుందని రామేశ్వర్ వ్యాఖ్యానించారు.


పెట్రోలు ధర ఎక్కువగా లేదని, ఇందులో పన్నులు కూడా ఉన్నాయని చెప్పారు. పెట్రోల్ కంటే ప్యాక్ చేసిన మినరల్ వాటర్ ధర ఎక్కువని రామేశ్వర్ పేర్కొన్నారు. పెట్రోల్ లీటరు ధర 40రూపాయలని, అసోం ప్రభుత్వం దీనిపై 28రూపాయల వ్యాట్, పెట్రోలియం మంత్రిత్వశాఖ 30రూపాయల పన్ను విధిస్తుందని మంత్రి వివరించారు. హిమాలయ లీటరు నీటి బాటిల్ ధర వందరూపాయలని, నీటి బాటిల్ కంటే పెట్రోల్ ధర తక్కువేనని మంత్రి చెప్పారు.


Updated Date - 2021-10-13T13:26:59+05:30 IST