ఆడిన మ్యాచులన్నీ గెలవలేం.. ఇది తాత్కాలికమే: రవిశాస్త్రి

ABN , First Publish Date - 2022-01-25T23:46:26+05:30 IST

దక్షిణాఫ్రికా పర్యటనలో భారత జట్టు ఘోర పరాభవంపై టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి స్పందించాడు. ఆడిన ప్రతి

ఆడిన మ్యాచులన్నీ గెలవలేం.. ఇది తాత్కాలికమే: రవిశాస్త్రి

మస్కట్: దక్షిణాఫ్రికా పర్యటనలో భారత జట్టు ఘోర పరాభవంపై టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి స్పందించాడు. ఆడిన ప్రతి మ్యాచ్‌లోనూ గెలవడం ఏ జట్టుకూ సాధ్యం కాదని అన్నాడు. భారత జట్టు ఒక్క సిరీస్‌లో ఓడిపోయినా విమర్శలతో విరుచుకుపడుతుంటారని, అయితే ఆడిన అన్ని మ్యాచుల్లోనూ గెలవడం సాధ్యమయ్యే పని కాదని తేల్చి చెప్పాడు.



అయినా, ఓడింది ఒక్క సిరీస్ మాత్రమేనని, అంతమాత్రానికే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నాడు. ఆట అన్నాక గెలుపు, ఓటమి కూడా ఉంటాయన్నాడు. ఈ ఓటములు తాత్కాలికమేనని పేర్కొన్నాడు. త్వలోనే భారత జట్టు పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.


65 శాతం విజయాలతో గత ఐదేళ్లుగా ప్రపంచంలోనే నంబర్ వన్ జట్టుగా ఉన్నామని గుర్తు చేశాడు. భారత జట్టు సాధిస్తున్న ఈ విజయాలు చూసి ఆందోళన చెందాల్సింది ప్రత్యర్థి జట్లు కానీ, మనం కాదని అన్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌లో తాను ఒక్క బంతిని కూడా చూడలేదన్న రవిశాస్త్రి.. ఒక్క సిరీస్‌లో ఓడిపోయినంత మాత్రాన జట్లు ప్రమాణాలు పడిపోయానని మాట్లాడడం సరికాదని రవి చెప్పుకొచ్చాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌ను 1-2తో చేజార్చుకున్న భారత జట్టు, మూడు వన్డేల సిరీస్‌లో 0-3తో దారుణ ఓటమి చవిచూసింది.   

Updated Date - 2022-01-25T23:46:26+05:30 IST