స్ర్కీన్‌ లాక్‌ ఉన్నా మెసేజెస్‌ పంపుకోవచ్చు

ABN , First Publish Date - 2022-06-04T09:03:43+05:30 IST

ఐఫోన్‌ వినియోగదారులకు శుభవార్త. ఐఫోన్‌ స్ర్కీన్‌ లాక్‌మోడ్‌లో ఉన్నప్పటికీ వాట్సాప్‌ మెసేజ్‌లకు సమాధానం ఇచ్చే వెసులుబాటు ఉంది.

స్ర్కీన్‌ లాక్‌ ఉన్నా  మెసేజెస్‌ పంపుకోవచ్చు

ఫోన్‌ వినియోగదారులకు శుభవార్త. ఐఫోన్‌ స్ర్కీన్‌ లాక్‌మోడ్‌లో ఉన్నప్పటికీ వాట్సాప్‌ మెసేజ్‌లకు సమాధానం ఇచ్చే వెసులుబాటు ఉంది. ఐఫోన్‌ 6ఎస్‌ నుంచి పైకి అంటే ఐఫోన్‌13, ఐఫోన్‌ 12 వరకు అన్నింటికీ ఈ ట్రిక్‌ వర్తిస్తుంది. నిజానికి ఆండ్రాయిడ్‌ డివైస్‌ల్లో లేని పలు ఫీచర్లను యాపిల్‌  తమ ఐఫోన్‌ వినియోగదారులకు అందుబాటులోకి తెస్తూ ఉంటుంది. అలాంటి వాటిలో ఒకటి - స్ర్కీన్‌ లాక్‌ చేసినప్పటికీ వాట్సాప్‌ మెసేజ్‌లకు సమాధానం ఇచ్చే వెసులుబాటు. అదెలాగంటే...


మెసేజ్‌ నోటిఫికేషన్‌ను కీ బోర్డు పైకి తీసుకువచ్చేందుకు టాప్‌ లేదంటే లాంగ్‌ ప్రెస్‌ అదీ కాదంటే గట్టిగా ప్రెస్‌ చేయాలి. 

రెస్పాన్స్‌ ఎంటర్‌ తదుపరి టాప్‌ చేసి పంపుకోవాలి.

గుర్తించాల్సినది ఏమిటంటే, సెట్టింగ్స్‌లోకి వెళ్ళి హప్టిక్‌ సెట్టింగ్స్‌ను అడ్జస్ట్‌ చేయాలి. తరవాత యాక్సెసిబిలిటీ, టచ్‌, హప్టిక్‌ టచ్‌, టచ్‌ డ్యూరేషన్‌ ఉంటాయి. 

సిరితో కాల్స్‌ చేసుకోవచ్చు. మెసేజ్‌లకు సమాధానం ఇచ్చుకోవచ్చు. అందుకోసం

ఐఫోన్‌లో వాట్సాప్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. 

ఐఫోన్‌ సెట్టింగ్స్‌లోకి వెళ్ళాలి

సిరి అండ్‌ సెర్చ్‌ ఆప్షన్‌ను మొదట కనిపెట్టాలి. క్లిక్‌ చేసి లిజన్‌ వైపు టర్న్‌ ఆన్‌ చేయాలి. హాయ్‌ సిరి లేదా సిరి కోసం సైడ్‌ బటన్‌ను ప్రెస్‌ చేయాలి.

ఐఫోన్‌ ఎస్‌ఇ(2020), ఐఫోన్‌ 8 ఇంకా ఓల్డర్‌ - సిరి కోసం టర్న్‌ ఆన్‌ ప్రెస్‌ హోమ్‌ చేయాలి.

స్ర్కోల్‌ డౌన్‌ చేసి వాట్సాప్‌ను టాప్‌ చేయాలి.

యూజ్‌ విత్‌ సిరి - టర్న్‌ ఆన్‌ చేయాలి.

ఐఫోన్‌ ఎక్స్‌, ఐఫోన్‌ ఎక్స్‌ఎస్‌, ఐఫోన్‌ ఎక్స్‌ఎస్‌మాక్స్‌, ఐఫోన్‌ ఎక్స్‌ఆర్‌ విషయంలో సైడ్‌ బటన్‌ ప్రెస్‌ చేసి హోల్డ్‌ -టర్న్‌ ఆన్‌ సిరి

Updated Date - 2022-06-04T09:03:43+05:30 IST