ఇన్‌స్టాలో కాంటాక్ట్‌ను మ్యూట్‌ చేయొచ్చు!

ABN , First Publish Date - 2021-08-21T08:17:19+05:30 IST

ఇన్‌స్టాగ్రామ్‌ ఎంతో ఆదరణ పొందిన మీడియా వేదిక. డౌన్‌లోడింగ్‌లో ప్రపంచంలోనే

ఇన్‌స్టాలో కాంటాక్ట్‌ను మ్యూట్‌ చేయొచ్చు!

ఇన్‌స్టాగ్రామ్‌ ఎంతో ఆదరణ పొందిన మీడియా వేదిక. డౌన్‌లోడింగ్‌లో ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉంది. ‘సెన్సర్‌ టవర్‌’ నివేదిక ప్రకారం ఈ జూలై నెలలో నాన్‌ గేమింగ్‌ యాప్‌ కేటగిరిలో ఎక్కువ మంది డౌన్‌లోడ్‌ చేసుకున్న యాప్‌గా నమోదైంది. ఇన్‌స్టాగ్రామ్‌ ఎంత గొప్పదైనప్పటికీ,  కొందరు తరచూ షేర్‌ చేసే ఇమేజెస్‌ ఇబ్బంది పెడుతుంటాయి. అవి సన్నిహిత స్నేహితుల నుంచి కూడా కావచ్చు.


అయితే వీటి నుంచి తప్పించుకునే మార్గం కూడా ఉంది. మీరు చూడకూడదు అనుకుంటున్న ఒక కాంటాక్ట్‌ నుంచే వచ్చే పోస్టులను మ్యూట్‌లో పెట్టేయవచ్చు. ఆ కాంటాక్ట్‌ను మీరు మ్యూట్‌ చేసినట్టు సదరు వ్యక్తికి కూడా తెలియదు. అయితే మీ పోస్టులను ఆ వ్యక్తి చూడగలుగుతారు. అదీ ఇందులో ఉన్న తిరకాసు. అందుకోసం కింది విధంగా చేయాలి


 ముందుగా మీ స్మార్ట్‌ ఫోన్‌లో ఉన్న ఇన్‌స్టాగ్రామ్‌ యాప్‌ను ఓపెన్‌ చేయాలి. 

 ప్రొఫైల్‌ దగ్గరికి సెర్చ్‌బార్‌పై సెర్చ్‌ చేసుకుంటూ వెళ్ళాలి. కాంటాక్ట్‌ ప్రొఫైల్‌పై క్లిక్‌ చేయాలి. 

 ఫాలోయింగ్‌ బటన్‌ టాప్‌ చేయాలి. అప్పుడు మూడు ఆప్షన్స్‌ తెరుచుకుంటాయి. మ్యూట్‌, రెస్ట్రిక్ట్‌, అన్‌ఫాలో

 మ్యూట్‌ బటన్‌ను టాప్‌ చేయాలి.

 ఎంపిక చేసిన కాంటాక్ట్‌ నుంచి వచ్చే పోస్టులను మ్యూట్‌ చేసేందుకు పోస్ట్‌ బటన్‌ను టోగెల్‌ చేయాలి. 

 తదుపరి స్టోరీస్‌ ఆప్షన్‌ను కూడా టోగెల్‌ చేయాలి. తద్వారా ఆ కాంటాక్ట్‌ నుంచి స్టోరీలను సైతం మ్యూట్‌లో పెట్టేయవచ్చు. 


Updated Date - 2021-08-21T08:17:19+05:30 IST