మీ స్టిక్కర్లు మీరే తయారు చేసుకోవచ్చు

ABN , First Publish Date - 2021-07-31T06:04:37+05:30 IST

యూజర్లు తమ మెసేజ్‌లను ఎఫెక్టీవ్‌గా ప్రజెంట్‌ చేయడానికి ఎమోజీ, జీఐఎఫ్‌ మాదిరిగానే స్టిక్కర్లు కూడా ఉపయోగిస్తూ ఉంటారు.

మీ స్టిక్కర్లు మీరే తయారు చేసుకోవచ్చు

మన దగ్గర సరైన యాప్‌ ఉంటే వాట్సాప్‌లో సొంత స్టిక్కర్‌లు తయారు చేసుకోవడం, వాటిని పంపడం చాలా సులువైన పని. వాట్సాప్‌ స్టిక్కర్స్‌ చిటికెలో ఎలా చేసుకోవాలో చూద్దాం...


యూజర్లు తమ మెసేజ్‌లను ఎఫెక్టీవ్‌గా ప్రజెంట్‌ చేయడానికి ఎమోజీ, జీఐఎఫ్‌ మాదిరిగానే స్టిక్కర్లు కూడా ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ప్లే స్టోర్‌, యాపిల్‌ స్టోర్‌ నుంచి వీటిని దిగుమతి చేసుకోవడానికి తోడు ఎవరికి వారు సొంతంగా రూపొందించుకోవచ్చు. ఇలా క్రియేట్‌ చేసిన స్టిక్కర్లను డివైస్‌ల ద్వారా వాట్సాప్‌ యూజర్లు ఎవరికైనా పంపుకోవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే స్టిక్కర్‌ ప్యాక్‌లను సొంతంగా రూపొందించుకోవచ్చు. 


సొంతంగా స్టిక్కర్స్‌ తయారు చేసుకోవాలంటే స్టిక్కర్‌ యాప్స్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్న తరవాత, కావాలనుకున్న ఇమేజ్‌ను యూజర్‌ తన ఫోన్‌ స్టోరేజ్‌లో నుంచి సెలెక్ట్‌ చేసుకోవాలి. అక్కడ నుంచి ఎలా రూపొందించుకోవాలో యాప్‌ గైడ్‌ చేస్తుంది. ఆ తరవాత దానిని వాట్సాప్‌లోకి ఇంపోర్ట్‌ చేసుకోవడమే. 


ఇలా తయారు చేసుకొవచ్చు

మీరు కావాలనుకున్న యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నాక దానిని ఓపెన్‌ చేయాలి.

స్టిక్కర్‌ పేరు, ఆథర్‌ పేరును ఎంటర్‌ చేయాలి.  ఫోన్‌ గ్యాలరీ లేదా గూగుల్‌ డ్రైవ్‌ ఎక్కడి నుంచైనా ఫొటోను సెలెక్ట్‌ చేసుకోవాలి.  

ఒక ప్యాక్‌లో 30 ఇమేజెస్‌ వరకు యాడ్‌ చేయవచ్చు. ఈ స్టిక్కర్స్‌ యానిమేటెడ్‌ లేదంటే స్టాటిక్‌ ఏదైనా కావచ్చు. అయితే  రెండూ కలిపి ఉండడానికి యాప్‌ అనుమతించదు. ఉంటే స్టాటిక్‌ ఇమేజ్‌ అయినా ఉండాలి లేదా యానిమేటెడ్‌ అయినా అయి ఉండాలి. తరవాత ఇమేజెస్‌ను కావాల్సిన విధంగా క్రాప్‌ చేయడం లేదా ఎడిట్‌ చేయడం చేయాలి.  

ఎడిట్‌ అయిన ప్యాక్‌ను వాట్సాప్‌లోకి డౌన్‌లోడ్‌ చేసుకున్న తరవాతనే కొత్తది క్రియేట్‌ చేయాలి. వాట్సాప్‌నకు స్టిక్కర్‌ ప్యాక్‌ను జతచేసేందుకు పబ్లిష్‌ బటన్‌ను హిట్‌ చేయాలి. తద్వారా ఇతర వినియోగదారులకూ పంపుకోవచ్చు. 

Updated Date - 2021-07-31T06:04:37+05:30 IST