మీ ఈమెయిల్‌ అడ్రస్‌ లీకైందా?..ఇలా తెలుసుకోవచ్చు

ABN , First Publish Date - 2021-04-10T06:01:26+05:30 IST

ఫేస్‌బుక్‌ మరోసారి వినియోగదారుల నమ్మకాన్ని కోల్పోయింది. 53 కోట్లకుపైగా వినియోగదారుల డేటా లీకైందని సమాచారం. ఇందులో భారతీయుల అకౌంట్లూ ఉన్నాయి

మీ ఈమెయిల్‌ అడ్రస్‌ లీకైందా?..ఇలా తెలుసుకోవచ్చు

ఫేస్‌బుక్‌ మరోసారి వినియోగదారుల నమ్మకాన్ని కోల్పోయింది. 53 కోట్లకుపైగా వినియోగదారుల డేటా లీకైందని సమాచారం. ఇందులో భారతీయుల అకౌంట్లూ ఉన్నాయి. అలా లీకైన డేటాలో ఫోన్‌ నంబర్లు, ఈమెయిల్‌ అడ్రస్‌లూ ఉన్నాయి. ఒక్క భారతీయులకు చెందినవే అరవై లక్షల మంది అకౌంట్ల నుంచి సమాచారం లీకైంది. దరిమిలా ఎవరైనా సరే ఫేస్‌బుక్‌ నుంచి తమ ఈమెయిల్‌ ఐడీ లీకైందా అన్నది ఇలా తెలుసుకోవచ్చు. 

  • https://haveibeenpwned.com<br>  లోకి వెళ్లండి
  • ఫేస్‌బుక్‌లో ఇచ్చిన ఈమెయిల్‌ ఐడిని ఎంటర్‌ చేసి <br>ని ప్రెస్‌ చేయండి. 
  • వెంటనే ఈమెయిల్‌ ఐడి లీకైందీ, లేనిదీ తెలుస్తుంది. 
  • మరో విషయం, అంతా లీకైందా, కొంత మేరా అన్నది కూడా తేలుతుంది.

Updated Date - 2021-04-10T06:01:26+05:30 IST