బీహార్‌ సంస్కృతి తెచ్చిందే నీవు

ABN , First Publish Date - 2022-08-16T05:43:41+05:30 IST

ఎన్నికలప్పుడే కనిపించే మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్‌ మం త్రి శ్రీనివాస్‌గౌడ్‌పై అర్థంపర్థం లేని వ్యాఖ్యలు చేయడం తగదని ముడా ఛైర్మన్‌ గంజి వెం కన్నముదిరాజ్‌, మునిసిపల్‌ ఛైర్మన్‌ కేసీ.నరసింహులు, వైస్‌ ఛైర్మన్‌ తాటిగణేశ్‌ ముదిరాజ్‌, జడ్చర్ల మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ మురళిముదిరాజ్‌ హెచ్చరించారు.

బీహార్‌ సంస్కృతి తెచ్చిందే నీవు
సమావేశంలో మాట్లాడుతున్న టీఆర్‌ఎస్‌ నాయకులు

- మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్‌పై టీఆర్‌ఎస్‌ నాయకుల ధ్వజం


మహబూబ్‌నగర్‌, ఆగస్టు 15: ఎన్నికలప్పుడే కనిపించే మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్‌ మం త్రి శ్రీనివాస్‌గౌడ్‌పై అర్థంపర్థం లేని వ్యాఖ్యలు చేయడం తగదని ముడా ఛైర్మన్‌ గంజి వెం కన్నముదిరాజ్‌, మునిసిపల్‌ ఛైర్మన్‌ కేసీ.నరసింహులు, వైస్‌ ఛైర్మన్‌ తాటిగణేశ్‌ ముదిరాజ్‌, జడ్చర్ల మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ మురళిముదిరాజ్‌  హెచ్చరించారు. సోమవారం టీ ఆర్‌ఎస్‌ జిల్లా కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. మహ బూబ్‌నగర్‌లో బీహార్‌ సంస్కృతిని తీసుకువచ్చిందే మీరని, అలాంటి మీరే బీహార్‌ సంస్కృతి ని తీసుకువస్తున్నారని, మంత్రిపై ఆరోపణలు చేయడం హాస్యాస్పదమని అన్నారు. తుపా కుల గురించి మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్‌ మాట్లాడటం విడ్డూరంగా ఉందని, ఆయన చరిత్ర ఏంటో పాలమూరు ప్రజలందరికీ తెలుసునని పేర్కొన్నారు. ఫ్రీడమ్‌ రన్‌ ప్రారంభంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ రబ్బర్‌ బుల్లెట్‌తో గన్‌ఫైర్‌ చేస్తే దాన్ని వక్రీకరిస్తూ అడ్డగోలుగా మా ట్లాడుతున్నారని, ఆయన  ఒకసారి తన చరిత్రను గుర్తుకు తెచ్చుకోవాలని, ఆయన గతం మరిచిపోయినా ప్రజలకు అంతా తెలుసని పేర్కొన్నారు.  ఓ కులం, మతం అడ్డం పెట్టు కుని రాజకీయాలు చేసే నీకు నిరంతరం అబివృద్ధి కోసం పాటుపడుతూ పేదలకు సాయం చేస్తున్న శేఖర్‌కు మంత్రిని విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. ఇంకోసారి ఇలాంటి విమ ర్శలు చేస్తే ఊరుకునేది లేదని, ఆయన చరిత్ర ప్రజలకు వివరిస్తామని హెచ్చరించారు. మహబూబ్‌నగర్‌లో జరుగుతున్న అబివృద్ధిని చూసి  భయపడి ప్రజల్లోకి వెళ్లలేని ఆయన జడ్చర్లలో రాజకీయం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎదుటివారిని విమర్శించేముందు మన గురించి గుర్తుంచుకొని మాట్లాడాలని సూచించారు. సమావేశంలో నాయకులు కిశోర్‌, ఆర్‌. రామకృష్ణ, పరమేశ్వర్‌, శాంతన్నయాదవ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-16T05:43:41+05:30 IST