నువ్వు రాజకీయ నిరుద్యోగివి

ABN , First Publish Date - 2021-07-21T16:07:32+05:30 IST

‘నువ్వో రాజకీయ నిరుద్యోగివి..

నువ్వు రాజకీయ నిరుద్యోగివి

ఉమాపై వసంత విమర్శ 


ఇబ్రహీంపట్నం: ‘నువ్వో రాజకీయ నిరుద్యోగివి. ఎక్కడ పడితే అక్కడ ప్రెస్‌ మీట్‌లు పెట్టడం నీకు పరిపాటి. దేశ, రాష్ట్ర రాజకీయాలు మాట్లాడుతూ ఎక్కడ ఏం జరిగినా చివరకు అది నాకు అంటగడుతూ మాట్లాడటం నీకు దినచర్యగా మారింది’ అని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్‌ ఇబ్రహీంపట్నంలో జరిగిన విలేకర్ల సమావేశంలో మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును హెచ్చరించారు. ‘సన్నాసులు, పనికిమాలిన దద్దమ్మలు ఎవరో ప్రజలందరికీ తెలుసు. నీ వెకిలి చేష్టలు, నీ వెటకారపు మాటలు, వ్యంగ్యమైన ధోరణీ మానుకోకపోతే తగిన విధంగా బుద్ధి చెపుతాం. నిరంతర ప్రక్రియలా జరిగే ప్రతి పని గురించి నా అనుచరులు, నా బావ మరిది అంటూ పనికిమాలిన ఆరోపణలు మానుకో. నీకు దమ్ముంటే నిరూపించు. ధాన్యం ఎంత కొన్నామని నువ్వు అడిగితే నేనెందుకు చెపుతా. వెళ్లి మార్కెట్‌ యార్డ్‌లో చూసుకో’ అని వసంత ఆగ్రహించారు.

Updated Date - 2021-07-21T16:07:32+05:30 IST