Sep 29 2021 @ 01:22AM

పెరుగన్నం ట్రై చేయండి!

సినీతారలు ఫిట్‌గా ఉండాలంటే సరైన ఆహారం చాలా ముఖ్యం అనే విషయం తెలిసిందే. సన్నజాజి తీగలా మెరిసిసోయే రకుల్‌ ఆరోగ్య ప్రయోజనాలను అందించే ఆహారానికి అధిక ప్రాధాన్యం ఇస్తారు. ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు, వాటి  పోషక విలువల గురించి పలు సందర్భాల్లో ఆమె సోషల్‌ మీడియా ద్వారా అభిమానుల్లో అవగాహన పెంచేందుకు ప్రయత్నిస్తుంటారు. తాను పెరుగు అన్నం తింటున్న ఫొటోను రకుల్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. మెత్తగా ఉడికించిన సబ్జా గింజలను పెరుగు అన్నంలో కలిపి తీసుకున్నారు. ‘‘పెరుగులోని సూక్ష్మజీవులు ఆరోగ్యానికి మేలు చేస్తాయి, సబ్జా గింజల్లోని పీచు పేగులను శుద్ధి చేస్తాయి. ఇది తిన్నాక ఒంట్లో తేలికగా, ఉల్లాసంగా అనిపిస్తుంది. మీరు కూడా ఓ సారి ట్రై చేసి చూడండి’’ అని ఆమె కోరారు. రకుల్‌ నటించిన ‘కొండపొలం’ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆమె హిందీలో ‘డాక్టర్‌జీ’ చిత్రంలో నటిస్తున్నారు.