యోగీజీ... పిల్లలే వద్దనే పాలసీ పెడితే బాగుంటుంది: ఎన్‌సీపీ సెటైర్

ABN , First Publish Date - 2021-07-12T23:25:56+05:30 IST

యోగి 'ఇద్దరు పిల్లల విధానం' కొత్తదంటూ ఉత్తరప్రదేశ్‌లోనూ, మీడియాలోనూ..

యోగీజీ... పిల్లలే వద్దనే పాలసీ పెడితే బాగుంటుంది: ఎన్‌సీపీ సెటైర్

ముంబై: యోగి 'ఇద్దరు పిల్లల విధానం' కొత్తదంటూ ఉత్తరప్రదేశ్‌లోనూ, మీడియాలోనూ ఊదరగొడుతుండటంపై ఎన్‌సీపీ జాతీయ ప్రతినిధి నవాబ్ మాలిక్ పెదవి విరిచారు. మహారాష్ట్రలోనూ, మరికొన్ని రాష్ట్రాల్లోనూ ఈ విధానం ఇప్పటికే ఉందని అన్నారు. మహారాష్ట్రలో కూడా ఇద్దరు పిల్లలకు మించి ఉంటే వాళ్లు ఎన్నికల్లో పోటీ చేయరాదనే నిబంధన ఉందని పేర్కొన్నారు.


ఇలా చేయండి...

''అసలు పిల్లలే అక్కర్లేదు, లేదా ఎక్కువ మంది పిల్లల్ని కనండి'' అనే పాలసీని యోగి ఆదిత్యనాథ్ తీసుకువస్తే బాగుంటుందని నవాబ్ మాలిక్ సలహా ఇచ్చారు. ఒకవైపు బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలు అవివాహితులని, మరోవైపు సాక్షి మహరాజ్ వంటి బీజేపీ నేతలు ఎక్కువ మంది పిల్లలు కనండంటూ నినాదాలిస్తున్నారని పేర్కొన్నారు. అందువల్ల పార్టీ నేతల అభిప్రాయాలకు అనుగుణంగా జనాభా విధానాన్ని యోగి ఆదిత్యనాథ్ తీసుకువస్తే బాగుంటుందని అన్నారు.


Updated Date - 2021-07-12T23:25:56+05:30 IST