మసీదు శంకుస్థాపనకు నేను వెళ్లను: యోగి

ABN , First Publish Date - 2020-08-08T07:15:29+05:30 IST

ఉత్తరప్రదేశ్‌కు తాను ముఖ్యమంత్రినే అయినా.. అయోధ్యలో నిర్మించే మసీదు శంకుస్థాపనకు వెళ్లనంటూ యోగి ఆదిత్యనాథ్‌ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి...

మసీదు శంకుస్థాపనకు నేను వెళ్లను: యోగి

లఖ్‌నవూ, ఆగస్టు 7: ఉత్తరప్రదేశ్‌కు తాను ముఖ్యమంత్రినే అయినా.. అయోధ్యలో నిర్మించే మసీదు శంకుస్థాపనకు వెళ్లనంటూ యోగి ఆదిత్యనాథ్‌ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఈ నెల 5న అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి ప్రధాని మోదీ చేతులమీదుగా జరిగిన భూమిపూజకు యోగి హాజరైన విషయం తెలిసిందే. అనంతరం మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ, ‘ముఖ్యమంత్రిగా అందరి విశ్వాసాలను, అన్ని మతాలను గౌరవిస్తాను. కానీ.. ఓ యోగిగా, ఓ హిందువుగా మసీదు శంకుస్థాపనకు నేను హాజరు కాలేను’ అని ఆదిత్యనాథ్‌ అన్నారు. దీనిపై ప్రతిపక్ష సమాజ్‌వాది పార్టీ తీవ్రంగా మండిపడింది. కాంగ్రెస్‌ పార్టీ మాత్రం యోగి వ్యాఖ్యలపై స్పందించడానికి నిరాకరించింది. 


Updated Date - 2020-08-08T07:15:29+05:30 IST