లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) మంగళవారంనాడు అసెంబ్లీలో కొద్దిసేపు నవ్వులు పూయించారు. అసెంబ్లీలో విపక్ష నేత అఖిలేష్ యాదవ్‌కు, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి మధ్య పెద్ద తేడా ఏమీ లేదని అన్నారు. ''మీకూ (అఖిలేష్), రాహుల్ గాందీకి మధ్య పెద్దగా తేడా ఏమీ లేదు. ఒకరేమో దేశాన్ని విదేశాల్లో విమర్శిస్తుంటారు. మరొకరు (అఖిలేష్) యూపీ నుంచి వేరే రాష్ట్రానికి వెళ్లి యూపీని విమర్శింటారు'' అని యోగి ఛలోక్తి విసిరారు. దీంతో సభలో ఒక్కసారిగా నవ్వులు వెల్లివిరిసాయి. ఆ సమయంలో అఖిలేష్ కూడా అసెంబ్లీలోనే ఉన్నారు.
ఇవి కూడా చదవండి
దీనికి ముందు, సోమవారంనాడు అసెంబ్లీలో అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ, యూపీలో విద్యావ్యవస్థ బాగోలేదన్నారు. తాను సీఎంగా ఉన్నప్పుడు ఒక పాఠశాలకు వెళ్లి తానెవరో చెప్పాలని ఒక విద్యార్థిని అడిగినప్పుడు ఆ విద్యార్థి రాహుల్ గాంధీ అని చెప్పాడని తెలిపారు. ఆయన చేసిన వ్యాఖ్యలకే యోగి తాజాగా కౌంటర్ ఇచ్చారు. మీ ఇద్దరి నేతల మధ్య పెద్దగా వ్యత్యాసమేమీ లేదని, ఒకరు దేశాన్ని (రాహుల్) దేశం వెలుపల, మరొకరు (అఖిలేష్) యూపీని యూపీ వెలుపల విమర్శిస్తుంటారని సెటైర్ వేశారు.